విజయనగరం: చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకో.. ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకో..అంటూ డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక సాదికార యాత్ర అత్యంత ఉత్తేజంగా సాగింది. నియోజకవర్గ పరిధిలోని పూల భాగ్ నుంచి సాధికార బస్సు యాత్ర ఆరంభం కాగా, అడుగడుగునా స్వాగతిస్తూ, జై జగన్ నినాదాలతో హోరెత్తింది. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల బృందం కొండ వెలగాడ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అనoతరం నెల్లిమర్ల సమీపంలోని మెయిద జంక్షన్ లో జరిగిన భారీ బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్ నాథ్, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరయ్యారు. శంషాబాద్ కు మించి భోగాపురం ప్రాంత అభివృద్ధి, సారిపల్లి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో విస్తృత ఉపాధి - మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఈ సందర్భంగా బారీ బహిరంగ సభలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా సరే అత్యంత వెనుకబాటుకు ఉత్తరాంధ్ర గురైందని, ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతాన్ని అబివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. రూ. 4,700 కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నారని, తెలంగాణలో ఎయిర్ పోర్టు కలిగిన శంషాబాద్ తరహాలోనే భోగాపురం ప్రాంతం కూడా అబివృద్ధి చెంది 50 వేల మంది వరకు ఉపాది లభించనుందన్నారు. సారిపల్లి ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త మార్పులు తీసుకువచ్చిన జగన్ సుపరి పాలన సాగిస్తున్నారని వెల్లడించారు. పథకాలతో జగన్ డబ్బును దుర్వనియోగం చేస్తున్నాడని ఓసారి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తానని మరోసారి, ఈ రెండింటిలో దేనికి కట్టుబడి ఉంటాడో చంద్రబాబు చెప్పాలి - మంత్రి ధర్మాన సవాల్ రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఎప్పుడో బ్రిటీష్ కాలంలో భూముల సర్వే జరిగిందని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు తమ భూములపై సరైన హక్కు పత్రాలను అందచేస్తూ చట్టబద్దం చేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పనులను గత ప్రభుత్వాలు చేయగలిగాయా అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. జమీందార్ల, భూస్వాములు, రాజులు వద్ద లక్షల ఎకరాల భూమి ఉంటే సీఎం జగన్ వాటిని పేదలకు పంపిణీ చేసారన్నారు. భూ పంపిణీతో పేదలకు సామాజికి హోదాను జగన్ కల్పించారన్నారు.రాష్ట్రంలో అన్ని హంగులున్న, ఏకైక అతి పెద్ద నగరమైన విశాఖను రాజధాని చేయాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫారసు చేస్తే, రాత్రికి రాత్రి అమరావతిని రాజధాని చేసి చంద్రబాబు కేంద్ర నిర్ణయాన్ని తొక్కి పెట్టారన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల అదృష్టశావత్తు జగన్ సీఎం అయి విశాఖను రాజధాని చేస్తానంటే ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 32 లక్షల మందికి 12 వేల 800 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి కాలనీలు మాత్రమే కాకుండా ఊర్లకు ఊర్లే నిర్మాణాన్ని జగన్ చేపడుతున్నారన్నారు. రూ. 2,40,000 కోట్ల ఖర్చు చేసి నాలుగున్నరేళ్లగా నిరంతరాయంగా సంక్షేమాన్ని జగన్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చెప్పిన అనేక పనులు చేసామని, ఇంకా ఏమైనా మిగిిలి ఉంటే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు ఒకసారి పథకాల పేరుతో జగన్ డబ్బు దుర్వినియోగం చేస్తున్నారని అంటాడని, రాజమండ్రి లో మరోసారి జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తానని ప్రకటించాడని, ఈరెండింటిలో దేనికి కట్టుబడి ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకో.. ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకో.. - డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, గత పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని, చంద్రబాబు చేసిన అన్యాయాలు, జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలతో మారిన జీవనం మధ్య తేడాలని కూడా ఆలోచించాలని కోరారు. చంద్రబాబు పాలనలో గిరిజనులకు, ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకుండా విస్మరించారని, జగన్ సీఎం అయిన తర్వాత ఈ రెెండు వర్గాలకు మంత్రి పదవులు కేటాయించి గుర్తింపునిచ్చారన్నారు. రూ. 87,618 కోట్ల రైతుల రుణాల మాఫి చేయాల్సి ఉండగా, కేవలం 15 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసి చంద్రబాబు చేయి దులుపుకున్నారని, రూ. 12 వేల కోట్లు డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని మహిళలకు హామీ ఇచ్చి వారిని మోసం చేసారని, మహిళలను, రైతులను మోసం చేసిన ఈ తెలుగుదేశం పార్టీని ఆ వర్గాలు ఎలా నమ్ముతాయని ప్రశ్నించారు. జగన్ ఎన్నికలకు ముందు చెప్పినవే కాకుండా, చెప్పనవి కూడా చేసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. పొత్తులతో మోసగాళ్లు వస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చి చేసిన మోసాలను గుర్తు చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నది గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర వేదికపై పాట పాడి సభికులను ఉత్సాహ పరిచారు. మీ మామను, బాబును అడిగితే భయమంటే ఏంటో చెబుతారు..లోకేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారంలో టీడీపీ జెండాలు, ఏపీలో బీజేపీతో పొత్తుకు పాకులాట - బాబుపై మంత్రి సీదిరి ధ్వజం పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార యాత్ర సంబరంలా సాగుతోందని, అన్ని సామాజిక వర్గాల నాయకులు, ప్రజలు కలసి వేడుకగా జరుపుతున్నారని వివరించారు. తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచిన చంద్రబాబును వెనక్కి పంపాలని, అందుకు వచ్చే ఎన్నికల్లో చేయి చేయి కలిపి సమిష్టిగా పని చేసి నెట్టి వేయాలని పిలుపునిచ్చారు. బాబుపై చర్యలు తీసుకునే అవకాశం ప్రజలకు వస్తుందని, ఎన్నికల్లో ప్యాన్ బటన్ నొక్కి చంద్రబాబును పంపేయాలని కోరారు. రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసి 45 వేల స్కూల్స్ ని నాడు - నేడు ద్వారా జగన్ అబివృద్ధి చేసారని మంత్రి అప్పలరాజు వివరించారు. పేదలు ఎవరి వద్దా తలదించాల్సిన, బ్రతిమాలాడాల్సిన, చేయి చాచాల్సిన అవసరం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న మనుసున్న ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని, ఇదే రాష్ట్రానికి నిజమైన సాధికారత అని వెల్లడించారు. ప్రజలు బాగోగులు చూసుకుంటున్న జగన్ కు భయమంటే ఏంటో పాదయాత్రచేస్తున్న లోకేశ్ చూపిస్తానంటున్నాడని, తన మామయ్య బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పులు జరిగినపుడు ఆసుపత్రిలో జాయిన్ అయి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఘటనను తెలుసుకోవాలని, తెలంగాణలో ఓటుకు నోటు కేసులో భయపడి రాత్రికి రాత్రే విజయవాడ వచ్చిన ఘటనలోనూ, స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి కళ్లు కనిపించడం లేదని బెయిల్ తెచ్చుకున్న తన తండ్రిని అడిగితే భయమంటే ఏమిటో చెబుతారని సీదిరి ఎద్దేవా చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారంలో తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుతుంటారని, చంద్రబాబు బీజేపీతో పొత్తుకు పాకులాడుతూ నీచ రాజకీయాలను చేస్తుంటే, జగన్ మాత్రం ఏ పార్టీతో పొత్తులు లేకుండా సింగిల్ గా వస్తున్నారని, మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం జగనే రావాలి..జగనే కావాలి అంటూ సభికులతో మంత్రి నినాదాలు చేయించారు. తన పాలన నచ్చితేనే ఓటేయాలని కోరుతున్న దమ్మున్న నాయకులు వైయస్ జగన్ - ఎంపీ బెల్లాన విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, అంబేద్కర్, ఫూలే, బాపూజీ ఆలోచనలను, కలలను సాకారం చేసేలా జగన్ సామాజిక సాధికారతను సాధించి చూపారని, అణగారిన వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారన్నారు. తన పాలన, సంక్షేమ పథకాలు నచ్చితేనే ఓటేయాలని కోరుతున్న ఏకైక దమ్ము ఉన్న నాయకుడు జగన్ మాత్రమేనని వెల్లడించారు. బీసీల పాలనలోనే విజయనగరం అబివృద్ధి, టీడీపీ విస్మరించింది - జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్ నాయకత్వంలో పేదలు తలెత్తుకుని తిరిగేలా అవకాశాలు కల్పించారన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగు నీరు తెచ్చింది అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ మాత్రమేనని, గత టీడీపీ ప్రభుత్వంలో అశోక్ గజపతి వంటి నేతలు కేంద్ర మంత్రిగా పని చేసినా సరే ఎటువంటి అభివృద్ధి పని చేయలేదన్నారు. ప్రపంచ పటంలో భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా ఉత్తరాంధ్రను జగన్ నిలిపారని, అలాగే ఇండిస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో పుట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి నేతలకు ప్రజాకోర్టులో ఓటమి తప్పదని హెచ్చరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మళ్లీ 9 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలు తిరుగులేని మెజార్టీతో గెలుచుకుంటామని మజ్జి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేసారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో విస్తృత అభివృద్ధి, ఉపాధి అవకాశాలు - నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ, వెనుకబడిన జాతులకు గౌరవం ఇచ్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పరిపాలన చేస్తున్నారంటే అది జగన్ కే సాధ్యమని ఉద్ఘాటించారు. గ్రామ స్థాయిలో సుపరిపాలన కోసం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారని వివరించారు. చంద్రబాబు మాట్లాడితే 45 సంవత్సరాల అనుభవమని చెప్పుకుంటాడు గానీ, రాష్ట్రానికిి ఏం చేసాడనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. వెనుకబడిన జిల్లా అయిన విజయనగరంలో ఎన్నడూ అగ్రకులాలు పరిపాలన చేయడం వల్ల అభివృద్ధి లేకుండా పోయిందని, బీసీల పాలనలోకి వచ్చిన తర్వాతే అనేక రంగాల్లో జిల్లా పురోగతి సాధించిందని పేర్కొన్నారు. టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పని చేసినా సరే బోగాపురం ఎయిర్ పోర్టు పనులకు శంకుస్థాపన చేయకపోగా, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వారిపై కేసులు పెట్టి వేధించారన్నారు. రూ. 4,700 కోట్ల వ్యయంతో భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు వైయస్ జగన్ హయాంలో జోరుగా సాగుతున్నాయని వివరించారు.