అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతమైంది. అలాగే సాయంత్రం జరిగిన బహిరంగ సభ ఉత్తేజంగా సాగింది. సభ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి ఉష శ్రీచరణ్, మాజీమంత్రి పేర్నినాని, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రసంగించారు. వీరితో పాటు సభలో స్థానిక సంస్థల ఛైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా – దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు. కానీ ఇప్పటిదాకా సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిపోయింది. – జగనన్న సామాజిక సాధికారతను ..ఈరోజు ఒక విధానంగా మార్చి చూపారు. – మహామహులు, గొప్పగొప్ప నాయకులు సామాజిక సాధికారతకోసం ఎంతగా శ్రమించారో, ఉద్యమాలు చేశారో చరిత్రలో చదువుకున్నాం. – అంబేడ్కర్, ఫూలే వంటి మహనీయుల ఆశయాలను ఆదర్శాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు జగనన్న. – సామాజిక సాధికారత విషయంలో జగనన్న వేసిన ముందడుగులు సామాన్యమైనవి కావు. ఆయన ఓ సామాజిక విప్లవాన్నే తీసుకొచ్చారు. – రాజకీయపదవులు, అధికారపదవులు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు కాదనుకున్న బాబులాంటి పాలకుల్ని చూశాం. కానీ నేడు జగనన్న ..ఆ వర్గాల వారే ఆయా పదవుల్లో ఉండాలంటూ ..పదవులు ఇచ్చారు. సామాజిక స్థాయిని పెంచారు. – సంక్షేమ పథకాల ద్వారా పేదల ఆర్థిక స్థాయిని పెంచారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి – కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, పార్టీల కతీతంగా ...పారదర్శకతతో సంక్షేమపథకాలు గడపగడపకు చేరేలా చేశారు సీఎం జగన్. – మహిళల స్వావలంబన కోసం జగనన్న అనేక పథకాలు తీసుకొచ్చారు. ప్రతి మహిళను తన స్వంత అక్క,చెల్లెమ్మలుగా భావించే జగనన్న ..అన్నింటా వారికి యాభై శాతం భాగస్వామ్యం కల్పించారు మంత్రి ఉషా శ్రీచరణ్ –సాధికారతకు నిదర్శనం సామాజిక సాధికార బస్సుయాత్ర. – జగనన్న ఎప్పుడూ కూడా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలలలో పెద్దపీట వేస్తూ వస్తున్నారు. – జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. – ఏ కులమూ తక్కువది కాదని చాటుతున్న జగనన్న...అంబేడ్కర్, ఫూలేల ఆశయాల బాటలో ముందుకు సాగుతున్నారు. మన వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళుతున్నారు. – జగనన్న పాలనతో కళ్లు తెరిచిన టీడీపీ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. – బాబు గతంలో జగనన్న సంక్షేమ పథకాలను విమర్శించారు. ఇప్పుడు నోరెళ్ల బెడుతున్నారు. – ఇక జనవరి1, 2024 నుంచి రూ.3వేల పింఛన్ ఇస్తున్నారు సీఎం జగనన్న. – హామీలిచ్చి, నెరవేర్చని చంద్రబాబును పట్టించుకోవద్దని కోరుతున్నాను. మాజీమంత్రి పేర్నినాని – సామాజిక సాధికార ఉత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే..ఈరోజు జగనన్న పాలనలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఎంతో మేలు జరిగింది కాబట్టి. – బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. ఎన్నికల వేళ మాత్రమే ఆ వర్గాలను వాడుకుంటారు. అధికారంలోకి రాగానే వారికి చేసేదేమీ ఉండదు. పదవులు అసలే ఉండవు. మంత్రి పదవులు ఉండవు. – బాబు హయాంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగం లేదు. ఓట్లు మనవి. అధికారం బాబు వర్గానిదే. మన వర్గాలంటే బాబుకు చులకన. – జగనన్నకు ఓట్లేసినందుకు ఈరోజు మనకు ఎన్నో పదవులు ఇచ్చారు. – ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు పెట్టి..వారి పిల్లల తలరాతలు మార్చారు వైయస్సార్. ఆయన హయాంలో ఎంతో మంది ముస్లిం పిల్లలు ఉన్నత చదువులు చదివారు. డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. తమ కుటుంబాల తలరాతలే మార్చారు. – ఈరోజు జగనన్న పేదల పట్ల ప్రత్యేక అపేక్షతో ఉన్నారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. – ఈరోజు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల సామాజిక స్థాయి, ఆర్థికస్థాయి పెరిగిందంటే ..మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే. అలాగే అధికార పదవులిచ్చి.. ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్లారు. – కలలోనైనా ఊహించని రీతిలో వెనుకబడిన వర్గాల ప్రతినిధులను పార్లమెంటు సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా.. మంత్రులుగా, ఆఖరుకు డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నది. – డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు మోసం చేస్తే..వారికి ఇచ్చిన హామీని నెరవేర్చి, వారికి మేలు చేశారు. ఆర్థిక స్వావలంబన సాధించిన ప్రతి మహిళా...సీఎం జగన్ ను స్వంత అన్నయ్యలా భావిస్తోంది. – నాడు నమ్మి బాబు ఓట్లేస్తే.. ప్రజల్ని నిండా ముంచారు చంద్రబాబు. – నేడు నమ్మి జగనన్నకు ఓట్లేస్తే...ప్రజల జీవనస్థాయిని పెంచారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. – చంద్రబాబు ఆరు హామీలంటూ మళ్లీ చెబుతున్నాడు. నమ్మితే మన జీవితాల్ని ఆర్పేస్తాడు. – చంద్రబాబు ..బాదుడే బాదుడంటూ ..జగనన్న ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. – పేదరికం పోవాలంటే చదువులు పెరగాలి. అందుకే జగనన్న రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పిల్లల చదువులతోనే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఎంపీ తలారి రంగయ్య – వెనుకబడిన కులాలకు పెద్దపెద్ద పదవులు ఇచ్చి .. సామాజిక సాధికారతను నిర్వచించి చూపారు సీఎం జగన్. – జగనన్నకు అధికారం రావడం వల్లే మనకందరికీ సాధికారత వచ్చింది. – జగనన్న పాలనలో కులమతాల వివక్ష, ప్రాంతం,పార్టీల వివక్ష లేదు. – నాడు–నేడు కింద సర్కారు బడులు, ఆస్పత్రులు ఎలా బాగుపడ్డాయో మనకందరికీ తెలుసు. – ఇంగ్లీషు మీడియం చదువులు పేదలకు అందుబాటులోకి తెచ్చి, ప్రపంచస్థాయిలో పోటీపడేలా చేశారు జగనన్న. – ఎప్పుడు అవకాశం వచ్చినా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు చేయడంలో జగనన్న వెనుకంజ వేసిన రోజే లేదు. – ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల పదవులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే. మన వర్గాల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి –అంబేద్కర్ కోరుకున్న సామాజిక సాధికారతను నిజం చేసి చూపారు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. - బడుగు,బలహీనవర్గాలకు, మైనార్టీలకు సామాజిక సాధికారతను సొంతం చేశారు. సామాజిక న్యాయానికి సరైన అర్థం చెప్పారు. – సంక్షేమం అంటే ఏదో ఉచిత పథకం కాదని, లబ్దిదారుల కుటుంబాలు మారాలి. వారి పిల్లల తలరాతలు మారాలి అన్న దార్శనిత సీఎం జగన్‌ది. – లక్షల కోట్లు ఖర్చు చేసి పేదల ఆర్థిక స్థాయిని పెంచే దిశలో ముందడుగులు వేశారు మన సీఎం. – 70శాతం బడుగు, బలహీనవర్గాలకు, పేదలకు సంక్షేమపథకాల లబ్ది అందింది. – ఒక్క అనంతపురంలోనే రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. – బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ఇలా ప్రతి వర్గానికి వందల కోట్లు అందించడం ద్వారా వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. – పేదలకోసం రూ.400 కోట్లు విడుదల చేశారు. రూ.800 కోట్లు రోడ్ల కోసం, కాలువల కోసం కేటాయించారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు – చైతన్యవంతమైన నేల అనంతపురం. – తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి మహామహా నాయకులను తయారుచేసిన నేల ఇది. – ఈనేలలో సామాజిక చైతన్యం ఎక్కువ. రాజకీయ చైతన్యం ఎక్కువ. – 2019లో జగనన్నను నమ్మి ఓట్లేస్తే..రూ.2.4లక్షల కోట్లను బడుగు,బలహీన, పేదవర్గాలకు నేరుగా అందించారాయన. – ఈరోజు అనంతపురంలో ఎక్కడ చూసినా, జనం కనిపించడం..జగనన్న మీద మీకున్న అభిమానానికి నిదర్శనం.