చేసిన పాపం రాస్తే పోతుందనుకున్న ’కొత్త పలుకు’

నారా’ఆత్మజ్యోతి’ ఎంతకాలానికెంతకాలానికి సత్యాన్ని పలికిందో?

దళితులను అవమానించినా, బలహీనవర్గాలను బెదిరించినా చంద్రబాబుగారికి దురంహంకారం లేదనే అనుకోవాలట. విదేశీ సంస్థలకు, స్వంత సామాజిక వర్గానికి శక్తివంచన లేకుండా చేయగలిగినంత చేస్తున్నా, ఆయనకు ఎలాంటి మమకారం, కులజాఢ్యం లేదనే అనుకోవాలట. ఇలా బాబుగారి సవాలక్ష అవలక్షణాల్ని ...సలక్షణాలుగా చూడాలన్నదే బాబుగారికి వంత పాడే మీడియా సంస్థల ఆర్డర్స్‌. ఇక్కడ కూడా బుద్దిజీవులెవరూ స్వప్రయోజనాల తీరును గమనించకూడదు. సొంతసామాజిక మీడియా బాగు కోసం బాబుగారు ఎంతగా తపించిపోతున్నారో పట్టించుకోకూడదు. ఇది చంద్రబాబుగారు,  ఆయనగారి తోక మీడియాల ఆలోచన తీరు. అందరూ బుద్దిగా వినాల్సిందేనన్న అహంకారం. వినకపోతే... తెలివిహీనులని...సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు చంద్రబాబుగారు, ఆయన సావాసగాళ్లు. 
వచ్చే ఎన్నికల సందర్భాన్ని ఉద్దేశించి ’మనం పోరాటం చేయాల్సింది...ఒక్క చంద్రబాబుతోనే కాదు...ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు ఇతర బాబుగారి తోకమీడియాలతో’ అని వైయ‌స్‌.జగన్‌ అన్నారు. అందుకు, ఆంధ్రజ్యోతిహెడ్‌ గింజుకున్నారు. తప్పులేదు. ఆ గింజుకోవడం ఎక్కువయి...ఆలోచనల సుళ్లు తిరిగి..మరో టాపిక్‌ను పైకి తీసి ...ఆదివారం నాడు ’కొత్త పలుకు’ పలికేశారు. నిజంగా కొత్త పలుకే. ఎంతకాలం బాబుగారి తప్పులపై  ముసుగులేసి..మా బాబుగారు బంగారం అని రాయనూ? అనుకుని రాసినట్టుంది. మళ్లీ అందులోనూ మనసు చావక, బాబుగారి ఓ చీకటికోణాన్ని తొలగించాలని ప్రయత్నించి...పది చీకటి కోణాలు నిజమేనని ఒప్పుకున్నారు. పది ఒప్పుకున్నాను కాబట్టి, ఈ ఒక్కటి నిజం కాదని నమ్మండి...అంటూ పేజీ కొద్దీ రాసిపడేశారు.
ఇంతకూ ఆ ఒక్క పాయింట్‌ ఏంటి? అదేనండి...ఈ మధ్య బాబుగారి పాలనాతీరును గమనించి, సూక్ష్మ,స్థూల స్థాయిల్లో వాస్తవాల్ని పట్టి...బాబుగారికి కులపిచ్చి ముదిరిందన్న విమర్శలు వస్తున్నాయి. స్వంత సామాజిక వర్గ ప్రయోజనాలకు బాబుగారు...ఎగిరిగంతేస్తూ, మనసంతా సంబరపడిపోతూ,  ఆ ’స్వంత’వారికి ప్రయోజనకరమైన పనులు చేసిపడేస్తున్నారు. ఇప్పుడు పడేస్తే, ఎన్నికల నాటికి తన వాళ్లంతా తనకు అండాదండా అవుతారని నమ్మకం. తనేమి చేసినా, చేయకపోయినా, తనను భుజానేసుకునే రక్తకులసంబంధీకులకు బాబుగారు ఏదేదో చేసేస్తున్నారని...కావాలంటే నిజాలు చూడండి అని సాక్ష్యాలతో సహా వివరిస్తుంటే...అదంతా తప్పని చెప్పడానికి ’కొత్తపలుకు’పాళీ తిరగతిప్పి, మళ్లతెప్పి వండివార్చిన కథనం చదివితీరాల్సింది. అన్ని తప్పులు ఒప్పుకుంటా...కానీ కులపిచ్చి తప్పు మాత్రం బాబు చెయ్యరు...ఇదొక్కటి నమ్మండి అని కావల్సినంత ఇంకిదిలించిరాశారో...క్యారెక్టర్స్‌ కొద్దీ వర్డ్స్‌ కొట్టారో గానీ, మొత్తానికి చివరాఖరుకు నారా’ఆత్మజ్యోతి’ ఎంతకాలానికెంతకాలానికి సత్యాన్ని పలికిందో?!
ఇదంతా చదువుతుంటే...తిక్కతిక్కగా, తిరగదిప్పి రాసినట్టుగా ఉందనుకుంటున్నారా? సారీ...అది అందరికీ చేతకాదు లెండి! సరి ఇన్ని మాటలేలా...అప్పుడు చదవకపోతే...ఇప్పుడు ఆ కొత్తవెలుగు పేజీలోని ఓ పేరాను చదవండి. మీరూ కూడా బోల్డాశ్యర్యపోతారు. నిజమా? బాబుగారి ’ఆత్మజ్యోతి’ ఇలా కూడా రాసిందా? అని విస్తుపోతారు. చదవండి మరి....
’గతంలోనూ...ఇప్పుడూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొన్ని తప్పులు చేసినమాట వాస్తవమే గానీ...(రాసిన ఆర్కే గారే కొన్ని అన్నారంటే...మీరు ఎన్నయినా అనుకోవచ్చు), కులపక్షపాతంతో ఆయన వ్యవహరిస్తారని ఇప్పుడే నిందలు మోస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు వెరపు ఎక్కువ. తన రాజకీయ అస్తిత్వానికి ప్రమాదం అనుకుంటే ఆయన ఎవరినైనా, ఎంతటి వారినైనా పక్కన పెట్టేస్తారు. చంద్రబాబుకు ఉన్న వ్యసనం ఒక్కటే...అది రాజకీయం ప్లస్‌ అధికారం. అధికారంలో కొనసాగడానికి వ్యక్తిగత విలాసాలను ఆయన ఎప్పుడో త్యాగం చేశారు. రాజకీయాలనే వ్యసనంగా మార్చుకున్నారు. ఆయనకు తన రాజకీయ భవిష్యత్తు మాత్రమే ముఖ్యం! వ్యక్తిగత విలాసాలను త్యాగం చేశారు. రాజకీయాలనే వ్యసనంగా మార్చుకున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. కుటుంబసభ్యలతో ఎక్కువ సేపు గడిపినా, చంద్రబాబుకు బోరు కొడుతుందట..’(పాపం ఇంతకాలం మనలాంటి అమాయకులంతా బాబుగారు ప్రజలసంక్షేమం కోసం నిరంతరం పాటుపడటానికి విలాసాలను త్యాగం చేశారని, రాష్ట్ర అభివృద్ది కోసం కుటుంబంతో గడపలేక, కనీసం మనవడితో ఆడుకోలేక పోతున్నారని బాధపడుతూ వున్నాం కదా? కాదని...అంతా అధికారం కోసమేనని... మనలో జ్ఞానజ్యోతిని వెలిగించినందుకు థాంక్స్‌ చెప్పుకుంటే తప్పులేదు). 
చదివేశారు కదా..,ఏమనిపించింది. బాబుగారు తన రాజకీయాలకోసం, అధికారపదవి కోసం ఏమైనా చేస్తారని, ఎవరినైనా పక్కన పడేస్తారని, అవసరమనిపిస్తే ఎవరినైనా నెత్తినెక్కించుకుంటారని, నో యూజ్‌ అనిపిస్తే... ఎవరినైనా పక్కన పడేస్తారని ఎవరు చెప్పారో తెలిసింది కదా?! బాబుగారి ’మనసునీడ’ అంతలా నారా క్యారెక్టర్‌ను విప్పదీసి చెబితే...నమ్మి తీరుదాం మరి. అంతా చదివాక మీకు....ఆర్కేగారు మీరే, బాబుగారు  పదవి కోసం ఏమైనా చేస్తారని ...సదరు వార్తా కథనమంతా నింపారు కదా...మరి ఆ పదవి కోసం...కులపిచ్చికూడా అంటించుకున్నారేమోగా? అని  ప్రశ్నించాలనిపిస్తోందా? వైస్రాయ్‌ ఎపిసోడ్‌ నడిపినప్పుడు ఆ కులపీఠాధిపతుల అభయహస్తాలు బాబుగారికి చేయూత నందించాయి కదా? అని మీ ప్రశ్నకు లాజిక్‌ కూడా అందించాలనుందా? సరే అన్ని తప్పులు చేసినోడికి, ఈ తప్పు చేయడం ఓ లెక్క అని గట్టిగా నిలదీయాలనుందా? అన్నట్టు...పాపం, మళ్లీ ఇప్పుడు ఎన్టీయార్‌ ఆత్మగౌరవ నినాదాన్ని ...బాబుగారు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. ఇంత కాలం తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు  పెట్టి రాజకీయాలు నడిపిన బాబుగారు...ఎన్నికల వేళ వచ్చేసరికి ఆత్మగౌరవ నినాదం ఎందుకు తలకెత్తుకోవాల్సి వచ్చిందో చెప్పడానికి...మళ్లీమళ్లీ కొత్తపలుకు’ ఎన్ని అక్షరాలు ధారపోస్తుందో...రాబోయే రోజుల్లో చదవాల్సిందే మరి!! ఇప్పటికిది. 
బాబుగారి యూటర్న్‌బట్టి పలికే రేపటి కొత్త వెలుగు కోసం ఎదురు చూద్దాం.....

Back to Top