స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్ల సహకారంపై చర్చ

ప్రభుత్వానికి సహకరించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి

తాడేపల్లి: ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో 212వ స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకర్లతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్స్‌ సహకారంపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top