శ్రీకాకుళం: మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతి, పురోభివృద్ధికి కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఏకైక పార్టీ వైయస్ఆర్ సీపీ అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడిచిన మూడేళ్లలో మహిళా సంక్షేమం, రక్షణ కోసం సీఎం వైయస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. బాధితులెవరూ లేని ఘటనపై తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తోందని, ఎంపీ గోరంట్ల మాధవ్ ఇష్యూతో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి ధర్మాన మండిపడ్డారు. ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా నడుచుకోవాలే కానీ గాడి తప్పి, పద్ధతి తప్పి అదే పనిగా అధికార పక్షం ను పదవి నుంచి, రాజ్యాధికారం నుంచి తప్పించాలని అనుకోవడం భావ్యం కాదని అన్నారు. బాధ్యతాయుతం అయిన విపక్షం చేసే పనులు ఇవేనా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విపక్ష నేత చంద్రబాబు నాయుడు పాటిస్తున్న పద్ధతులు, వివిధ సందర్భాల్లో నడుచుకుంటున్న తీరు, ప్రధానంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి ధర్మాన స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ఏం మాట్లాడారంటే.. ``ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంకు సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీకి చెందిన ప్రధాన విభాగాలు కానీ , ఆ పార్టీ అభిప్రాయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్న ప్రధాన మీడియా కానీ ఇతర సాధనాలు కానీ గడిచిన కొన్ని రోజులు గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓ ప్రచారాన్నీ, ఇంకా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలను కించపరిచే పార్టీ అని చేస్తున్న దుష్ప్రచారాన్నీ ఆపుచేయాలి. మహిళల స్వేచ్ఛకు భంగం కలిగించే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నిలుపుదల చేయాలి. మహిళలను గౌరవించేందుకు ఇష్టం లేని పార్టీ ,మహిళల అభ్యున్నతి కోసం పనిచేయని పార్టీ అంటూ అధికార పార్టీపై అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు..దీనిని నిలుపుదల చేయాలి. ఈ క్రమంలోనే వారు చేస్తున్న అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించాలని భావిస్తూ ఉన్నారు. ఇది తగదు. మహిళల ఉన్నతికి వారి సంక్షేమానికి ఇంకా చెప్పాలంటే వారి ఆర్థిక పురోగతికీ, పురోభివృద్ధికీ కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమయిన రాజకీయ చరిత్ర ఉన్న నేత చంద్రబాబు ఆయన పాలన ఎలాంటిదో తెలిసిందే. ఆయన ప్రతిపక్ష నేత గా ఏనాడూ సమర్థనీయ పాత్ర వహించలేదన్నది నా అభిప్రాయం. డెమోక్రసీలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ చాలా ముఖ్యమయినవి. తాను అధికారంలో లేనప్పుడు తన ప్రత్యర్థులైనటువంటి వారిని నిలువరించేందుకు చిన్న చిన్న ఎత్తుగడలతో, అబద్దపు పోకడలతో, అనైతిక ప్రచారంతో ప్రత్యర్థులను పడగొట్టాలని భావిస్తుంటారాయన. ప్రయత్నిస్తుంటారాయన. తద్వారా తను అధికారం సాధించాలని పూర్తి విశ్వాసంతో పని చేసేటటువంటి నేత చంద్రబాబు నాయుడు. ఇందుకు గతంలో ఆయన అవలంబించిన పోకడలే తార్కాణం. గతంలో ఎంత మంది కావాల్సినటువంటి వారిని ఏ విధంగా అప్రతిష్ట పాల్జేసి తరువాత అధికారంలోకి వచ్చారో అన్నది అందరికీ తెలిసిందే ! కుయుక్తులతో ఎదుటి వ్యక్తులను పడగొట్టవచ్చు అనేవాటిపైనే ఆయనకు ఎక్కువ విశ్వాసం. కానీ ప్రజాస్వామ్యంలో విశాలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుటివారిని ఎదుర్కొందాం అన్నటువంటి సంసిద్ధత ఎప్పుడూ ఆయనలో ఉండదు. అలాంటి కుయుక్తుల్లో భాగమే నేడు అనంతపురంలో పార్లమెంట్ సభ్యుని వ్యక్తిగత వ్యవహారాన్ని, ఆరోపణల్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మొత్తం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే మహిళలకు వ్యతిరేకం ప్రజలకు నచ్చజెప్పేయాలని సృష్టించినటువంటి డ్రామా ఇప్పుడు గత వారం రోజులుగా నడుస్తోంది. కానీ ఇది అబద్దం. ఇది అసత్యం. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చేస్తున్న కుతంత్రం అని విన్నవిస్తున్నాను. వాస్తవానికి మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, వారి ఉన్నతికి, ప్రగతికి దోహదపడుతున్న పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కానీ వారి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కానీ వాళ్లు అధికారంలో ఉన్ననాడు ఈ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ఎలా కృషి చేశారో అన్నది. ఆ విషయాలు మీరిప్పుడు చెప్పనక్కర్లేదు వారి చర్యలే చాటి చెబుతాయి. ఇదే సమయాన మరో ప్రశ్న .. ఎందుకు ? చంద్రబాబు కూడా ఎందుకు ఇటువంటి విషయాలపైనే దృష్టి సారిస్తున్నారంటే ఎప్పుడైనా మనకు ఆర్గ్యూ చేసేందుకు, తను బాధ్యత వహిస్తున్న పదవుల గురించి సరిగా చెప్పడానికి సరైన అస్త్రాలన్నవి లేవని మీకు విన్నవిస్తున్నాను. మహిళల్ని తాను గౌరవించాలి అని కానీ, ప్రోత్సహించానని కానీ ఆయన చెప్పలేరు. చెప్పలేకపోవడం వల్ల ఈనాడు అధికార పార్టీ నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి మోసగించారు అని చెప్పాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. సహేతుకం అంత కన్నా కాదు. ఇదొక అబద్దపు ప్రచారం. ఎందుకని చెప్పలేకపోయారంటే జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లో పెద్ద ఎత్తున మహిళల్ని చేర్చుకుని, గడిచిన కాలంలో ఎన్నడూ కూడా ఇంత మంది మహిళలు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భంలో ఈ విషయమై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల, నియమాకాల ఆవశ్యకత ఏంటన్నది తప్పక తెలుస్తుంది. దీనిని మనం మహిళలకు వ్యతిరేకం అయినటువంటి పార్టీ ఇదని, నాయకత్వం ఇదని చెప్పగలమా ? ఎక్కువ మంది మహిళలను ప్రభుత్వంలో చేర్చుకుని, వాళ్లను పాలనలో భాగస్వామ్యం చేసి మహిళా సాధికారికతకు గొప్ప నిర్వచనం ఇచ్చే విధంగా పాలన సాగిస్తున్న వైనం ఈ ప్రభుత్వానిది. కనుక ఈ ప్రక్రియ చూసి ఎవ్వరైనా ఈ పార్టీ మహిళలకు వ్యతిరేకం అని ఎవ్వరూ చెప్పలేరు కదా ! అదేవిధంగా 2014లో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు ఓ మాట చెప్పారు. మీరు బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాను అని ఆ రోజు చంద్రబాబు చెప్పారు. కానీ ఆయన ఇచ్చిన మాట తప్పారు. అదే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మొత్తం నాలుగు విడతలకు గాను మూడు విడతల్లో డ్వాక్రా రుణ మాఫీకి సంబంధించి నిధులను సంబంధిత అకౌంట్లలోకి జమ చేశారు. ఈ ప్రక్రియ చూశాక అయినా ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పగలరా ? కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఇల్లాలు బాధ్యతగా ఉంటూ, ఆ ఇంటిని తీర్చిదిద్దే క్రమంలో ఉంటుంది కనుక వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఓ వ్యక్తిగతం అయిన సమస్యను ప్రధానమయిన సమస్యగా మార్చారు. అదేవిధంగా మహిళలందరికీ వైసీపీ బూచీగా చూపే ప్రయత్నం ఒకటి చేశారు. ఆయనే అంతా చేస్తున్నారు. అయినా ఇలాంటి సందర్భంలో ఏ ప్రభుత్వమూ సమర్థించదు. ఆరోపణలను రికార్డు చేస్తారు.. రిజిస్టరు చేస్తారు.. దర్యాప్తు చేస్తారు. రుజువు అయినప్పుడు అటుపై చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. విపక్షాల ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాలా వద్దా వాటికిభిన్నంగా సీఎం వైయస్ జగన్ స్పందించారా ఇలాంటివి ఉపేక్షించారా లేదు కదా ! అందుచేత బలహీనత చంద్రబాబుకు ఎందుకు వచ్చిందంటే ఆ ఆరోపణ పట్టుకుని వేలాడుతూ దిగజారిపోతున్నారు. తద్వారా ఆయన మరింత పరువు పోగొట్టుకుంటున్నారు మీ అనుభవం ఏమయిందని ? గడిచిన వారం రోజులుగా ఇదే ఇష్యూపై మాట్లాడుతున్నారు. ఇతర అంశాలపై మీరు మాట్లాడకపోవడం వల్ల ఓ ప్రధాన ప్రతిపక్షం తాలూకా బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నారు. బాధితులా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవ్వలేదు కదా కానీ మీరు మాత్రం అదే విషయాన్ని పట్టుకుని నానా యాగీ చేస్తున్నారు. ఒక మహిళను హోం మంత్రిగా చేసి దిశా యాక్ట్ తీసుకువచ్చి పనిచేస్తున్న ప్రభుత్వంను ఇవాళ ఈ విధంగా మాట్లాడడం తగని పని. ఇది బాధ్యతారాహిత్యంగా ఉంది. విపక్షాలు మాట్లాడేందుకు అనేక విషయాలు ఉన్నాయి. సమాజానికి పనికి వచ్చే విషయాలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఆరోపణలు సబబుగా లేవు. వీటిని మీరు మరోసారి పునః సమీక్షించుకోవాలి. మీరు ఈ ప్రభుత్వం పాలనను చూసి ఓర్వలేక ఈరోజు మీరు దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయం చూసి చాలా చూసి నవ్విపోతున్నారు అని చెబుతున్నాను. విశాల ప్రయోజనాల కోసం మాట్లాడాలని కోరుతున్నాను. సమాజానికి చేటు చేసే పని ఎవ్వరు చేసినా తప్పే మాట్లాడవద్దు అని అనను కానీ ఇదే అంశం ఓ ప్రధానాంశంగా తీసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా అధికార పార్టీని పడగొట్టేయాలని అనుకోవడం సబబు కాదు. మీరు లైన్ మార్చుకోవాలని, మీ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.``