ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం

సీఎం వైయస్‌ జగన్‌తో ‘పోస్కో’ సంస్థ ప్రతినిధులు భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో తమ సంస్థలను భారీస్థాయిలో నెలకొల్పుతామ‌ని వెల్ల‌డి

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ వెల్లడించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటును అందిస్తాయన్నారు. పారిశ్రామికాభివృద్ధికి  ఉపకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు ఉన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top