వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయ చ‌ర్య‌లు

పాలు, వాట‌ర్ ప్యాకెట్ల పంపిణీని ప్రారంభించిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి

 విజ‌య‌వాడ‌: వరద బాధితులకు సహాయార్ధం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి రూపాయలతో స‌హాయ చ‌ర్య‌లు ప్రారంభించింది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో లక్ష పాల పాకెట్లు, రెండు లక్షల వాటర్ బాటిల్లా పంపిణి, వరద బాధితుల వద్దకు చేర్చేందుకు పాలు, వాటర్ పాకెట్ల తో నింపిన ట్రాక్టర్లను, ఆటోలను, జేసిబి లను మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రజలందరికి పాల ప్యాకేట్లు, వాటర్ ప్యాకెట్లు అందించవలసిందిగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయ‌న పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు,  శాసనమండలి సభ్యులు  ఎండీ రూహుళ్ల , కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు

Back to Top