కర్నూలు: ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీలు ఏమయ్యాయని వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో `చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ`..బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం సన్నాహాక సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్. వి.మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ..`వైయస్ జగన్‌ను ఓడించండం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టాడు. అందమైన అబద్దాలను హమీలుగా ఇచ్చాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధమే గెలిచింది. ప్రజలు.. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అందుకే "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" పేరుతో వైయస్ఆర్‌సీపీ ప్రజల్లోకి వెళ్తుంది. క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మ్యానిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మ్యానిఫెస్టో వస్తుంది. మొట్టమెదటి సారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకుడు వైయస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముక వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హమీలు ఇచ్చాయి. 50 ఏళ్లు నిండినా ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానని.. నోటికొచ్చిన హమీలను చంద్రబాబు ఇచ్చారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేశాడు’’అని సతీష్ మండిపడ్డారు ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుదాం: ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలను ఇంటింటా ప్రచారం చేసి ఎండగడుదామని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజమని గుర్తు చేశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, పార్టీ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ అనుబంధం విభాగాల రాష్ట్ర, జిల్లా ,నియోజకవర్గ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.