రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు పేరిట స్మృతివనం

ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కృష్ణంరాజు కుటుంబీకులకు తెలిపిన మంత్రులు

పశ్చిమ గోదావరి: కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు పేరిట స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. రెండెకరాల స్థలంలో కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు మంత్రి రోజా వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు మంత్రులు ఆర్కే రోజా, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు భార్య, సోదరుడి కుమారుడు ప్రభాస్‌ను మంత్రులు పరామర్శించారు. సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం తీరని లోటు అని మంత్రులు అన్నారు. కృష్ణంరాజు పేరిట రెండెకరాల స్థలంలో ఏర్పాటు చేయబోయే స్మృతివనం వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగిందన్నారు. 
 

Back to Top