మిగ‌తా రాష్ట్రాల‌కు ఏపీ ఆద‌ర్శం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై సర్దేశాయ్ ప్రశంసల జల్లు
 

తాడేప‌ల్లి: క్లిష్ట సమయంలో కొత్త 108, 104 అంబులెన్సు సర్వీసులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైయ‌స్​ జగన్​మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజ్​దీప్​ సర్దేశాయ్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కరోనా వైరస్​పై పోరాటంలో దక్షిణాది రాష్ట్రాలు మిగలిన వాటితో పోల్చితే ముందంజలో ఉన్నాయని అన్నారు.

కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్సులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తాయని సర్దేశాయ్ పేర్కొన్నారు. వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానించారని తెలిపారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు

తాజా ఫోటోలు

Back to Top