టీడీపీ నేతల బుర్రల్లో ఇస్మార్ట్ చిప్పులు పెట్టండి

చంద్రబాబు స్థాపించింది పాల ఫ్యాక్టరీయా? పప్పుల ఫ్యాక్టరీయా? 

వైయస్‌ఆర్‌సీపీ నేత పీవీపీ సెటైర్లు 

విజయవాడ:  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాపించింది పాల ఫ్యాక్టరీనా? లేక పప్పుల ఫ్యాక్టరీనా? అని వైయస్‌ఆర్‌సీపీ నేత పీవీపీ ప్రశ్నించారు. ప్రపంచంలోనే శ్రేష్ఠమైన పప్పులను చంద్రబాబు తయారుచేసి వదులుతున్నాయని టీడీపీ నేతలను ప్రస్తావించారు. అసలు ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతల బుర్రల్లో ఇప్పటికైనా ఇస్మార్ట్ చిప్పులు పెట్టాలని సూచించారు. ఈ మేరకు పీవీపీ  ట్వీట్ చేశారు.

Back to Top