పండుగ పూట చంద్ర‌బాబు నీచ రాజ‌కీయం

ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైయ‌స్ జ‌గ‌న్‌పై దుష్ప్ర‌చారం

కూటమి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.

● ఈ సందర్భంగా పుత్తా శివశంకర్‌ మాట్లాడుతూ...

“ఓం నమో వేంకటేశా నమః. ఈ రోజు తెలుగు ప్రజలంతా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న సమయంలో, రాజకీయాలే పరమావధిగా మార్చుకున్న చంద్రబాబు తన నీచ నికృష్ట రాజకీయ సంస్కృతిని మరోసారి బయటపెట్టారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజలందరికీ ఫోన్‌లు చేసి, వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు చేయని తప్పులను చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

రాజకీయంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ప్రజల్లో నిలదొక్కుకోలేక, ఈ ప్రభుత్వ విధానాలు ప్రజలకు నచ్చకపోవడంతో ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని రాజకీయ ఎజెండాగా మార్చుకున్నారు. ఇవాళ హిందువులను, హిందూ సంస్థలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు.

చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తాయి. 2007లో వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు జీవో ఇచ్చి ఏడు కొండలు పూర్తిగా టీటీడీ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టంగా చెప్పారు.

గుళ్లు, స్వామివారి విగ్రహాలు కూల్చింది చంద్రబాబే. రామతీర్థంలో రాముడి తల నరికిన వ్యక్తికి ఈ కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.5 లక్షలు ఇచ్చింది. దీన్ని బట్టి హిందువులను ఎవరు రెచ్చగొడుతున్నారో, ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలి.

రథం కాల్చిన ఘటనపై వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించారు. వైయస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని గుళ్లు నిర్మించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు 40 గుళ్లు కూల్చితే, వాటిని వైయస్‌ జగన్‌ గారు తిరిగి పునఃనిర్మించారు.

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆ కల్తీ నెయ్యి మీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ముందు జంతు కొవ్వు అన్నారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే… కాదు కాదు వెజిటబుల్‌ ప్యాటీ అంటున్నారు.

గోవిందరాజు ఆలయంపైకి ఎక్కి ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తే, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు.

తిరుమల కొండలో మద్యం సీసాలపై కూడా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మా నాయకుడు, మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి గారు స్పష్టంగా వివరించారు. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరించి ఆ నెపాన్ని వైయస్‌ జగన్‌పై మోపే కుట్రలు చేశారు.

రాజకీయంగా వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని సనాతన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, లడ్డూ అయినా, విగ్రహం అయినా చెప్పులు విప్పి అత్యంత పవిత్రంగా స్వీకరిస్తారు.

ఇలాంటి నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ అవాకులు, చవాకులు పేలితే అవే వారికి తిరిగి తగులుతాయి. వేంకటేశ్వరస్వామి కూటమి నాయకులకు తగిన గుణపాఠం చెబుతారు. వైయస్‌ఆర్‌సీపీ హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై పోరాటం చేస్తుందని పుత్తా శివశంకర్ స్పష్టంచేశారు

Back to Top