ప్రజా సంకల్పయాత్ర భవిష్యత్‌ తరాలకు మార్గదర్శి..

శ్రీకాకుళంఃప్రజల కష్టాలు తీర్చాలనే గొప్ప సంకల్పంతో వైయస్‌ జగన్‌ చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర  భవిష్యత్తు తరాలకు మార్గదరి అని వైయస్‌ఆర్‌సీపీ  సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఎవరు చేయలేనంతగా  పాదయాత్ర జరిగిందన్నారు. పాదయాత్రకు సహకరించిన ఐదు కోట్ల తెలుగు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ జగన్‌ రాజకీయాల్లో ప్రవేశించినప్పటికి నుంచి  ఆయన రాజకీయం, వ్యక్తిత్వం మీద దాడి జరగడమే కాకుండా ఆయన మీద భౌతికంగా కూడా హత్యాయత్నం జరిగిందన్నారు. చంద్రబాబు,వారి మిలాఖత్‌ శక్తులు అన్ని కలిసి ఆయనను రాజకీయంగా  నిర్మూలించాలని, వ్యక్తిత్వంలో అణగదొక్కాలని,భౌతికంగా కూడా ఆయనను లేకుండా చేయాలని కుట్రలకు పాల్పడ్డారన్నారు.

Back to Top