విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జనం నుంచి పుట్టిన నాయకుడు అని, ఆయన వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, నందమూరి లక్ష్మీపార్వతి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మాట్లాడుతూ.. కులాలు, మతాలు, డబ్బులోంచి నాయకులు పుడుతుంటారని, కానీ, జనం నుంచి పుట్టిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. వైయస్ జగన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఆయనతో స్నేహం చేశానని చెప్పారు. సీఎం వైయస్ జగన్.. స్వీటెస్ట్, హాటెస్ట్, హానెస్ట్, గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్.. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఇచ్చిన పదవిని స్వీకరిస్తున్నానని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి ఎంతమంచి చేస్తానో చెప్పలేను కానీ, చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అబద్ధాలు చెప్పను. గ్యారంటీగా చిత్ర పరిశ్రమకు సేవ చేస్తా.. సీఎం వైయస్ జగన్‌కు మచ్చ తేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. తాను చనిపోయేంత వరకు సీఎం వైయస్ జగన్, వైయస్‌ఆర్ సీపీ జెండా తప్ప మూడోది లేదని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.