వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌తో వంశీ ధైర్యంగా ఉన్నారు

ములాఖత్‌లో వల్లభనేని వంశీని కలిసిన పంకజశ్రీ

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించడంతో జైల్‌లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ధైర్యంగా ఉన్నార‌ని ఆయ‌న స‌తీమ‌ణి పంక‌జ‌శ్రీ పేర్కొన్నారు. విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న భార్య పంక‌జ‌శ్రీ కూడా వంశీతో ములాఖ‌త్ అయ్యారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  ‘వంశీ జైల్‌లో చాలా ధైర్యంగా ఉన్నారు. వైయ‌స్ జగన్ లీగల్‌గా మేం చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు, భయపడవద్దు అని దైర్యం చెప్పారు. సత్యవర్ధన్ కేసులో 20 వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20 వేల రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు. మేం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టకూడదు అంటున్నారు.. మా మీద అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వారే మహిళలా?.. మిగతా వారు మహిళలు కాదా?. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దు’ అని పంకజశ్రీ కోరారు. 

Back to Top