పది నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాలు

దక్షిణ కొరియా నుంచి ఏపీకి లక్ష ర్యాపిడ్‌ కిట్లు

టెస్టింగ్‌ కిట్లను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేసేందుకు లక్ష కోవిడ్‌ ర్యాపిడ్‌ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను సీఎం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాపిడ్‌ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు. కొత్తగా లక్ష ర్యాపిట్‌ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించున్నాయి. కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం ర్యాపిడ్‌ కిట్లను వినియోగించనున్నారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లు పాల్గొన్నారు. 

Back to Top