నిర్మలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి స్వాగతం

 తిరుపతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం  రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న నిర్మలా సీతారామన్‌కు టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. కేంద్రం మంత్రితో పాటు విజయసాయి రెడ్డి కూడా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 

Back to Top