నిన్ను నమ్మం బాబూకు విశేష స్పందన

 రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ’నిన్ను నమ్మం బాబూ...’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. 13 జిల్లాల్లో ఎక్కడ చూసినా బాబును నమ్మము అంటూ బానర్లు కనిపిస్తున్నాయి. బాబును ఎందుకు నమ్మడంలేదో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతున్నారు. ఈ కాంపెయిన్ చంద్రబాబు అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబు అసమర్థతను, అబద్ధాలను, మోసాలను ప్రజలముందు ఉంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, వాట్స్ అప్ లలో ఎంతో మంది బాబును నమ్మం అంటూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. బాబు చెప్పిన అబద్ధాల గురించి వివరిస్తూ, బాబును నమ్మం అని చెబుతూ వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నారు. అన్ని మాధ్యమాల ద్వారా చంద్రబాబు దగాకోరుతన్నాన్ని నిరసిస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాంటి కొన్ని స్పందనలే ఇవి  
గిరిజనులకు ఇళ్లన్నాడు. భూముల పట్టాలన్నాడు. ఎవ్వరికీ రాలేదు. అందుకే ఇక బాబును మేము నమ్మం. 
 కొమరయ్య.. ఆదివాసీ యువకుడు
ఇంటికో ఉద్యోగం అన్నాడు. లక్షల పోస్టులు ఉన్నాయని చెప్పి వేటికీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. నాలుగేళ్లుగా డీఎస్సీకోసం పడిగాపులు పడుతున్నాం. ఇప్పుడు 7000 పోస్టులకు డీఎస్సీ పెట్టి అందులోనూ బోలెడు మతలబులు చేసాడు. అందుకే బాబు జన్మలో నీ మాట నమ్మం.
 ప్రవీణ్, ఓ నిరుద్యోగి.
మా ఇంటిముందు దరువేసి మరీ చెప్పించాడు. బంగారం విడిపిస్తాను. మీరు రూపాయి కూడా అప్పు కట్టొద్దు అని. నిజమని నమ్మాను. నా బంగారం ఇప్పుడు బాంకు వేలం పాడేసింది. బాబు నోరు తెరిస్తే అబద్ధాలే. మళ్లీ మా గడప తొక్కనివ్వం. బాబును ఎప్పటికీ నమ్మం. 
 సూర్యకుమారి, గృహిణి
రైతులంటేనే మండిపడే మనిషి మారాడు అంటే నిజమనుకున్నా. రుణాలు మాఫీ చేస్తాడని చెబితే ఓటేసా. ఆయిన ముక్కలు ముక్కలుగా ఇచ్చిన చిల్లర వడ్డీకి జమై పోయింది. నా అప్పు అసలు బాంకులో అలాగే ఉంది. ఛీ బాబును మళ్లీ నమ్మితే నక్కను నమ్మినట్టే. 
 రామచంద్రరావు, రైతు
తోబుట్టువులు మీరు అంటూ తొండి మాటలు చెప్పి ఇప్పుడు సభలకు రాకపోతే ఫైను కట్టండి అంటున్నాడు. డ్వాక్రా రుణాలు రూపాయి కూడా మాఫీ కాలేదు. మమ్మల్ని వేధించుకు తింటున్న బాబుకు పుట్టగతులుండవ్. బాబును నమ్మే ప్రశక్తే లేదు. ఓటేసే సమస్యేలేదు.
 దేవీప్రియ, పొదుపు మహిళ
70ఏళ్లు దాటిన నాకు పింఛను రావడం లేదు. పుట్టుకతో అవిటివాడైన నా మనవడికి వచ్చే పింఛను ఆగిపోయింది. ఉన్న కాస్త ఆసరా కూడా లేకుండా చేసిన ఇట్టాంటి కసాయి ముఖ్యమంత్రి వద్దే వద్దు. మళ్లీ ఈ జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేసే ఖర్మపట్టొద్దు. చంద్రబాబును ఎవ్వరూ నమ్మద్దు. 
 సార్ల వెంకటేశ్వర్లు, వృద్ధుడు
రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న గొంతులివి. బాబూ నువ్వొద్దు అంటూ ప్రతిధ్వనిస్తున్న పలుకులివి. వైసీపీ అండగా ఉండగా బాబు అన్యాయాలపై ఎలుగెత్తి చాటేందుకు, ఎదురు తిరిగి నిలబడి కడిగేందుకు ప్రతి తెలుగువాడూ ఓ అస్త్రంలా నిలిచాడు. బాబూ నిను నమ్మం అంటూ భ్రమరావతి బాబుకు వినిపించేలా అరిచాడు. వైయస్సార్ కాంగ్రెస్ ఆరంభించిన ’నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తమ మనసులోని మాటను బయటపెట్టే అవకాశం కలిగించింది. చంద్రబాబు తీరును ఎండగట్టే వేదికను కల్పించింది. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ కార్యక్రమం అద్దం పడుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

Back to Top