అవినీతి రహిత పారదర్శక సుపరిపాలనే ల‌క్ష్యం

ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

నవరత్నాలే ప్ర‌ధాన‌ అజెండా.. 

 అమరావతి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా కొద్దిసేప‌టి క్రితం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైయ‌స్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించనున్నారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

ప్రతి సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు
 డైనమిక్ సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో అధికారులు, కలెక్టర్లు సమర్థవంతంగా పని చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో అమలులో చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని ఆయ‌న కొనియాడారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పథకాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి వారం తాను కూడా కలెక్టర్లతో సమీక్షిస్తానని చెప్పారు. అధికారులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గంటల తరబడి సమీక్షలు పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టకూడదని సీఎం భావించినట్లు తెలిపారు. సృజనాత్మక ఆలోచనలు చేయటానికి అధికారులకు ఎక్కువ సమయం ఇవ్వాలని భావించారని చెప్పారు. అందుకే షెడ్యూల్‌ని అవసరమయిన సమయం మేరకు మాత్రమే నిర్థేశించారని తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top