డబ్బు, మద్యం లేకుండా తిరుపతి ఉప ఎన్నికలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరదీశారని నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి పంచకుండా, ఎవరికీ మద్యం పంపిణీ చేయకుండా ప్రలోభాలు లేని ఎన్నికలు నిర్వహించారని ప్రశంసించారు. మెరుగైన పాలన, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులను వైయ‌స్ జగన్ గెలిచారని ఆమె కొనియాడారు. ఆదివారం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద నాటకం ఆడాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు లేని దొంగ ఓట్లు.. ఇప్పుడు తిరుపతి ఎన్నికలప్పుడే ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కావాలనే దొంగ ఓట్లంటూ రోడ్లెక్కి తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రచారాలతో తమ పార్టీ ప్రతిష్ఠ ఏమాత్రం దిగజారదన్నారు.
మంత్రి పెద్దిరెడ్డిపై కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేశారని రోజా మండిపడ్డారు. దొంగ ఓట్లని ప్రచారం చేస్తున్నప్పుడు.. పోలింగ్ బూతుల్లోనే దొంగ ఓటర్లను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. కరోనా బాధితులకు సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వం మంచి చికిత్సలు అందిస్తోందని ఆమె కొనియాడారు.

Back to Top