నార్నే శ్రీనివాసరావు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

హైదరాబాద్‌: టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్న వేళ సినీ నటుడు నందమూరి తారక రామారావు( జూనియర్‌ ఎన్టీఆర్‌) మామ నార్నే శ్రీనివాసరావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరి బంధువు. నార్నే శ్రీనివాసరావు చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిసేపటి క్రితం వైయస్‌ జగన్‌ను కలిసిన నార్నే వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి వైయస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ..రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ నాయకత్వం అవసరమన్నారు. ఆయన్ను ఖచ్చితంగా గెలిపించేందుకు వైయస్‌ఆర్‌సీపీలో చేరానని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 
 

Back to Top