ఒంగోలు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదులను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి, అక్కడి బ్లాక్ బోర్డు, డెస్క్‌లు, మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే ఇంగ్లిష్ ల్యాబ్, డాక్టర్ వైయస్‌ఆర్ కంటి వెలుగు, వైయస్‌ఆర్ కిశోర వికాసంకు సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు. Read Also: కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు