వెదురు సాగుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రోత్సాహం

నేష‌న‌ల్ బ్యాంబో మిష‌న్ అటవీశాఖ నుంచి ఉద్యాన శాఖకు బదిలీ 

ముఖ్యమంత్రికి ధ‌న్య‌వాద‌ములు తెలిపిన అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి

అమ‌రావ‌తి:  వెదురు సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశ‌గా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నేష‌న‌ల్ బ్యాంబో మిష‌న్ ప‌థ‌కాన్ని అట‌వీ శాఖ నుంచి ఉద్యాన శాఖ‌కు బ‌దిలీ చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల ఏపీ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర్ మిష‌న్ ఉపాధ్య‌క్షులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అద్య‌క్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేర‌కు ఎంవీఎస్ నాగిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

గౌ॥ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన పంటలు సాగు చేయడము జరుగుతుంది. వరి లాంటి పంటలు అవసరమునకు మించి ఉత్పత్తి జరగడము వలన ప్రభుత్వము బోర్ల క్రింద, ప్రత్నామాయ పంటలకు అవకాశము వున్నచోట ప్రధాన చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, లేదా రాష్ట్రములో ఉద్యాన పంటలకు అనువైనది కనుక ఉద్యాన పంటలు వేసుకోమని రైతులకు అవగాహన చేయటము జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ ప్రత్నామాయ పంటలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించడము జరిగింది. అందులో భాగంగా పామ్ అయిల్, కొబ్బరి, కొకో, బత్తాయి, వక్క (Areca nut) జాజి జాపత్రి (Nutmeg), మిరియాలు (Black pepper) మరియు వెదురు (Bamboo) సాగు గురించి క్షేత్ర స్థాయిలో పర్యటించడము జరిగింది. వెదురు (Bamboo) సాగుపై రైతులు, శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వ అధికారులు (Officers) తో సమావేశము కూడా నిర్వహించి, National Bamboo Mission గురించి విస్తృతంగా చర్చించడము జరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, తెలంగాణా లాంటి రాష్ట్రాలు National Bamboo Mission ద్వారా వెదురు (Bamboo) సాగు అధికంగా ప్రోత్సహించడము వలన అక్కడి రైతులు లబ్దిపొందడము జరిగిందని తెలుసుకోవడము జరిగింది. వెదురు సాగు పెంచడానికి వీలుగా భారత ప్రభుత్వము వెదురును చెట్టు నుండి గడ్డి జాతిగా గుర్తిస్తూ అటవీ చట్టం 1927 (Forest Act, 1927) లో మార్పులు చేయడము జరిగింది. దీని వలన రైతులు వారి పోలాల్లో సాగుకు చేసుకోవడానికి, వెదురు పై ఆధారపడే పరిశ్రమ వృద్ధికి దోహదపడింది.

మన రాష్ట్రములో రైతులకు ప్రత్నామాయ పంటల వైపు పోత్సహించడములో భాగంగా వెదురు (Bamboo) సాగు చేయడానికి రైతులకు అవగాహన కల్పించడములో, ఎప్పుడు రైతులతో వుంటూ ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తే బాగుంటుంది అని భావించి ప్రస్తుతము అటవీశాఖ పరిధిలో వున్న National Bamboo Mission పథకమును ఉద్యాన శాఖకు బదిలీ చేయవలసిందిగా ఈ నేల 07.02.2022న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.య‌స్. జగన్ మోహన్ రెడ్డి గారికి నివేదించగా గౌరవ ముఖ్యమంత్రి గారి అదేశాలతో 15.02.2022 రాష్ట్ర ప్రభుత్వము Bamboo Mission పథకము అటవీ, పర్యావరణ శాఖ నుండి ఉద్యానశాఖకు బదిలీ చేయడము జరిగింది. దీని వలన రైతులకు వెదురు సాగుపై అవగాహన పెరిగి, సాగు విస్తీర్ణము పెరగడానికి దోహద పడుతుంది మరియు రైతులకు 4వ సంవత్సరము నుంచి మంచి ఆదాయము పొందడానికి అవకాశం ఉన్నది.

రైతులకు దోహద పడే విధంగా తక్షణ నిర్ణయము తీసుకున్న గౌరవ శ్రీ వై.య‌స్. జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

(యం.వి.ఎస్.నాగిరెడ్డి)

Back to Top