సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మున్నూరు కాపు కుల‌స్తుల కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మున్నూరు కాపు కుల‌స్తులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్, పోలవరం విలీన మండలాల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తమను బీసీలుగా గుర్తించాలని విలీన మండలాల్లోని మున్నూరు కాపులు ఇటీవ‌ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తి మేర‌కు పోలవరం విలీన మండలాల్లోని మున్నూరు కాపు కులస్తులకు బీసీ–డీ కింద గుర్తిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రిని కలిసిన మున్నూరు కాపు కుల‌స్తులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి, మున్నూరు కాపు సంఘం ఎటపాక డివిజన్‌ ప్రెసిడెంట్‌ ఉమాశంకర్, నాయకులు వెంకటేశ్వర రావు, నాగేంద్ర, శివాజీ, నాగేశ్వరరావు, నాగ సూర్యనారాయణ, రాహుల్‌ నాయుడు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top