విజయవాడ నుంచి హజ్ యాత్ర కు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలి

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన లేఖ‌ను కేంద్ర మంత్రికి అందించిన ఎంపీలు

న్యూఢిల్లీ: విజయవాడ నుంచి హజ్ యాత్ర కు వెళ్లేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాసిన లేఖ‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అంద‌జేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు వై.యస్. అవినాష్  రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ఇవాళ న్యూ ఢిల్లీ లో  కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీని  కలిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని హజ్ యాత్రికుల కోసం విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్ గా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ,  ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా నివసిస్తున్నదని, హజ్ యాత్రికుల పై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా, వారు తక్కువ చార్జీలతో  విజయవాడ నుంచి హజ్ యాత్ర కు వెళ్లేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన లెటర్ కేంద్ర మంత్రికి అంద‌జేశారు.

Back to Top