ప్రజా సమస్యలపై బాబు ఒక్క పోరాట‌మైనా చేశారా? 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి: అమరావతి భూముల విలువ తగ్గిందనే ఆర్తనాదాలు తప్ప ఏడాదిన్నరలో ప్రజా సమస్యలపై చంద్ర‌బాబు చేసిన పోరాటం  ఒక్కటీ లేదంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. కౌంటింగ్ మొదటి 3 రౌండ్లలో వెనక్కి నెట్టినందుకు కుప్పం ప్రజల పైనా కక్ష పెంచుకున్నాడు. స్థానిక ఎన్నికలు జరిగితే విజయ ఢంకా మోగిస్తాడట. నిమ్మగడ్డపై భరోసా కాబోలు అంటూ ట్వీట్ చేశారు.

అడ్డుకుంటున్నదెవరు?
చిత్తుగా ఓడి కూడా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దొంగ చాటుగా డ్రాకోనియన్ లాను రుద్దుతున్నదెవరు యనమల గారూ! ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చిన వైయ‌స్ జ‌గ‌న్ గారు ఏది చేయాలన్నా అడ్డుకుంటున్నదెవరు? ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి కూడా దర్యాప్తులు జరగకుండా రక్షణ పొందుతున్నది మీ నాయకుడు కాదా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో ప్ర‌శ్నించారు.

Back to Top