చివరకు చంద్రబాబు కుప్పంకు పరిమితం

ఎంపీ  విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదాలో  హుందాగా ఉండట్లేదని, అసూయ, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.  'ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయారని ట్వీట్‌ చేశారు.   అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన నాయకుడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడని  పేర్కొన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నాడు' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

Read Also: ‘అనంత’ను స్మార్ట్‌ సిటీగా మారుస్తాం

తాజా ఫోటోలు

Back to Top