స్కెచ్ వేయడంలో చంద్రబాబును మించినవాళ్లెవరూ లేరు

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి, ఏ మాట ఎవరితో అనిపించాలి అనే స్కెచ్ వేయడంలో చంద్రబాబును మించినవాళ్లెవరూ లేరని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు వ్యవహార శైలికి విజయసాయిరెడ్డి దీటుగా బదులిచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తాము ఎన్నికల్లోనే పోటీచేయబోమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడని, ఇది చంద్రబాబు చెప్పించిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
 

Back to Top