లోకేసం..ఎవరికీ పైసా ప్రయోజనం లేడు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి
 

విశాఖ‌:  టీడీపీ నేత నారా లోకేష్ తీరును  వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఎల్లో మీడియా ఇచ్చిన ఎలివేషన్లతో నిజంగానే తనో పెద్ద నాయకుడినని భ్రమల్లో బతికేస్తున్నాడు లోకేసం.  ఎమ్మెల్సీ గడువు దగ్గర పడుతోంది. మళ్లీ ఎన్నికయ్యేంత సీన్ లేదు.  మిడిమిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు పేలుతూ ప్రజలకు హాస్యం పంచడం తప్ప ఎవరికీ పైసా ప్రయోజనం లేదు.

విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు  హైదరాబాద్ ఇంటి నుంచి కదలడు. జూమ్ లో కోతలు - పచ్చ మీడియాలో బాకాతో సరిపెడుతున్నాడు. లేస్తే మనిషిని కాదంటాడు. కానీ లేవలేడు. బయటకు రాలేడు. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టేస్తా, ఆస్పత్రులు కట్టించేస్తానంటాడు. మాటలు కోటలు దాటినా కళ్లు మాత్రం ఇల్లు దాటవు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top