తాడేపల్లి: పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నాయని గ్రహించేలోగానే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని చెప్పారు. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలన్నారు. లిటిగేటర్ల అవతారం అవసరాల కోసం స్వార్థంతో జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని హెచ్చరించారు. మీడియా ఎంటర్టైనర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని తెలిపారు.