పార్టీని బ‌లోపేతం చేద్దాం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అనుబంధ విభాగా అధ్య‌క్షుల‌తో విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ బ‌లోపేతంపై వారితో చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు చేశారు. అనుబంధ విభాగాల అధ్య‌క్షుల‌కు పార్టీ బ‌లోపేతంపై విజ‌య‌సాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. గౌరవ సీఎం శ్రీ వైయ‌స్ జగన్ గారి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్లాలని ఈ స‌మావేశంలో నిర్ణయించారు.  ఈ భేటీలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ విభాగాల అధ్య‌క్షులు జంగ కృష్ణ‌మూర్తి, చల్లా మ‌ధుసూద‌న్‌రెడ్డి, గౌతంరెడ్డి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, మేరుగ నాగార్జున‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

దేశానికే ఆద‌ర్శం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌
రాష్ట్రంలో ప్రజాపాలనకు 1000 రోజులు పూర్తయ్యాయి. కోట్లాది ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ వైఎస్ జగన్ గారు జన సంక్షేమ పాలన అందిస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశానికే ఆదర్శంగా పలు విప్లవాత్మక మార్పులు, వ్యవస్థలను తీసుకొచ్చారు. కరోనా కష్టాల్లో ప్రజలకు బాసటగా నిలిచార‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top