హింస‌,ఉన్మాద రాజ‌కీయాల‌కు టీడీపీ పెట్టింది పేరు

 వీళ్లకంటే దావూద్ గ్యాంగ్ చాలా నయం

ట్విట్ట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు.  ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు. వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులను కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అంటగట్టడం టీడీపీ దివాళాకోరుతనానికి నిదర్శనం. హింస, ఉన్మాద రాజకీయాలకు ఆ పార్టీ పెట్టింది పేరు.  మా కార్యకర్తలను 400 మందిని పొట్టన పెట్టుకుంది. జగన్ గారు దీనిపై అప్పట్లోనే గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top