చంద్రబాబు అనుమానపు మొగుడులాంటి వాడు

ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకున్న లక్షణాలు రెండు. చాదస్తపు మొగుడు, అనుమానపు మొగుడు.

 ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.  

 

శాసన సభ్యుడు వంశీ స్పీకర్ దృష్టికి తీసుకురావడానికి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు లక్షణాలు ఎలా ఉన్నాయంటే అనుమానపు మొగుడు, చాదస్తపు మొగుడులాగే ఉన్నాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే బాధపడిపోయి,  సొంత పార్టీ సభ్యుణ్ణి అనుమానించి బయటకు గెంటేసారు. సస్పెండ్ చేసారు. ఆయన ఈ బాధను ఇవాళ సభలో చెప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే అదీ చెప్పుకోనీకుండా సభలో రచ్చ చేసి, ధర్నా చేసి సభలోంచి బయటకు వెళ్లారు. ఇది చంద్రబాబ చాదస్తాన్ని చూపిస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధాన నిర్ణయాలు బాగున్నాయి, ఆయన పేదల బిడ్డలకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించడం కరెక్ట్ అని ఓ ప్రతిపక్ష సభ్యుడు నాలుగు మంచి మాటలు చెబితే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.  వారి పార్టీ సభ్యుడే టీడీపీ తీరును తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి సంబంధం లేని, అనవసరపు విషయాల పట్ల ధర్నాలు చేసి, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి పిచ్చిపనులు చేసి పార్టీ పరువు తీసుకోవద్దని ఆ సభ్యుడు తమ నాయకుడికి సూచిస్తే, భరించలేకపోతున్నారు.  ఇది నిజంగా దురదృష్టం. ఈ రాష్ట్ర చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి, శాసన సభ్యుడు పొగడటం ఇదే తొలిసారి. దీన్ని చూడలేక తట్టుకోలేక బయటకు వెళ్లిన మనిషి 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా వారు చేస్తున్న దుష్ప్రచారం వారికే నష్టం అని తెలుసుకోవాలి.

Read Also: నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం వద్దకు వెళ్తే తప్పా?

తాజా ఫోటోలు

Back to Top