నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం వద్దకు వెళ్తే తప్పా?

అభివృద్ధి కోసం ఏ సభ్యుడైనా నన్ను కలవొచ్చని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు

సభలో వంశీ మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకున్నారు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని ఎమ్మెల్యే వంశీ మాట్లాడితే తప్పెలా అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వద్దకు ఓ ఎమ్మెల్యే వెళ్తే తప్పా అని ప్రశ్నించారు. సభలో అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను బుగ్గన రాజేంద్రనాథ్‌ తప్పుపట్టారు. ఆయన ఏమన్నారంటే.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రోజుకు ఒక్కసారైనా మీరు నాలెడ్జ్‌ తెచ్చుకోండని అంటున్నారని, నా సూచనలు వినమంటున్నారన్నారు. ఆయన సూచనలు ఐదేళ్లు విన్నాం..నాలెడ్జ్‌ తెచ్చుకున్నామన్నారు. వంశీ ఏమీ అనకముందే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. వారు సభ నుంచి ఎందుకు భయటకు వెళ్లారో..ఎందుకు వచ్చారో అందరం చూశామన్నారు. ఎమ్మెల్యే వంశీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువుల విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని అన్నారు. ప్రభుత్వం అందరిది, ముఖ్యమంత్రి అందరి వాడు. 2014 వరకు ఏ ఎమ్మెల్యే అయినా వెళ్లి కలిసే వారు. నియోజకవర్గం, వ్యక్తగత పనుల నిమిత్తం సభ్యులు సీఎంను కలిసేవారు. గతంలో ఏ ఎమ్మెల్యేకైనా నిధులు కేటాయించేవారు. గతంలో చంద్రబాబు కేవలం తన ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చారని, ఓడిపోయిన టీడీపీ నేతలకు నిధులు ఇచ్చి..మాకు ఇవ్వమని చంద్రబాబే స్వయంగా చెప్పారు. కనీసం సీఎం రీలిఫ్‌ ఫండ్‌ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు మానవత్వం లేకుండా విభజించి పాలించారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక సీఎం డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఎవరికైనా ఇస్తామని, టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. నాలెడ్జ్‌ గురించి అచ్చెన్నాయుడు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వంశీ తన గురించి మాట్లాడితే టీడీపీ సభ్యులు ఎందుకు ఉలిక్కిపడ్డారో తెలియదన్నారు. 
 

Read Also: టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top