ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ 

 కళ్యాణదుర్గం నియోజకవర్గం  ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ 
 

అనంత‌పురం:  ప్ర‌జా ఆరోగ్యంపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న‌ట్లు ఎమ్మెల్యే ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ తెలిపారు.  గురువారం అనంత‌పురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప‌త్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.  రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంద‌ని చెప్పారు. ఎల్లప్పుడూ వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.  అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్  ప్రార్థించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top