కూట‌మి నేత‌లు కారుకూత‌లు ఆపాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్‌

చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇవ్వలేదా?

హామీలు అమలుచేయకపోతే చొక్కా పట్టుకోమని లోకేష్ చెప్పలేదా

వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ముందా?

తాడేప‌ల్లి:  వైయ‌స్ జగన్‌ గారు ప్రెస్‌ మీట్‌ పెట్టిన తర్వాత కూటమి నేతలు, చంద్రబాబు బినామీ గ్యాంగ్‌లు, మంత్రులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, వారి ఫ్రస్టేషన్‌ అర్ధమవుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్రెస్‌ మీట్‌ తర్వాత కూటమి పార్టీ నాయకులు, మంత్రులు చేసిన ఆరోపణలపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారుకూతలు కూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ ఏమ‌న్నారంటే..

వైయ‌స్ జగన్‌ గారు ప్రెస్‌ మీట్‌ పెట్టిన తర్వాత కూటమి నేతలు, చంద్రబాబు బినామీ గ్యాంగ్‌లు, మంత్రులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, వారి ఫ్రస్టేషన్ అర్ధమవుతోంది, చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇవ్వలేదా, హామీలు అమలుచేయకపోతే చొక్కా పట్టుకోమని చెప్పలేదా, లోకేష్‌ గారు కాలర్‌ పట్టుకుని నిలదీయమన్న సంగతి మరిచారా, మరి ఇప్పుడు హామీల గురించి మాట్లాడితే మేం రూ. 1000 పెన్షన్‌ పెంచామంటున్నారు, అయితే 2 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి పెన్షన్‌ ఇస్తున్నారు, ఏం సమాధానం చెబుతారు. జగన్‌ గారు తన దగ్గర ఉన్న డేటాతో వాస్తవాలు చెప్పారు, మీరు ఏ విధంగా విఫలమయ్యారు, మేం జగన్‌ గారి పాలనలో అభివృద్దిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం, ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా రూ. 2.73 లక్షల కోట్లు అందించామో వివరించారు. 

మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మీరు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయండి, మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ ఏమైంది, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వేల మందిని తొలగించింది వాస్తవం కాదా, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అసమర్ధ పాలనతో, నాయకత్వ లోపంతో, పైకి పొత్తులు లోపల కత్తులు పెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నది మీరు కాదా

నిజంగా జగన్‌ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఒక్క ఆధారమైనా ఉందా, నిరాధార ఆరోపణలు మాని ప్రజలకు సేవ చేయండి, బాధ్యతతో వ్యవహరించండి, ఇలా దిగజారి మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం, నిందలు వేస్తూ కాలం గడుపుతున్న మీ అసమర్ధ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారు

పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ..
మా నాయకులు వైయ‌స్ జ‌గ‌న్ గారి ప్రెస్‌ మీట్‌ తర్వాత కూటమి నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారు, కూటమి నేతల కూసాలు కరిగి మతిభ్రమించి మాట్లాడారు, నిజాలు సహించలేకపోతున్నారు, జగన్‌ గారు వాస్తవాలు చెప్పగానే కూటమి నాయకుల కడుపుమంట బయటపడింది, జగన్‌ గారు పూర్తిగా అధ్యయనం చేసి అన్నీ ఆధారాలతో మీడియాతో మాట్లాడతారు, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలకే పరిమితమవుతారు, కూటమి నాయకులు ఫేక్‌ న్యూస్‌ సృష్టించి ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

జగన్‌ గారు ఇప్పటివరకూ 11 ప్రెస్‌ మీట్‌లు పెట్టారు, తిరుపతి లడ్డూ వివాదం నుంచి సెకీ వరకు, బడ్జెట్‌ లోపాలపై అన్నీ ఆధారాలతో మాట్లాడారు, చంద్రబాబు ఒక్క ప్రెస్‌ మీట్‌ అయినా ఆధారాలతో పెట్టారా, మీకు వాస్తవాలు చెప్పే దమ్ముందా, చంద్రబాబు నేను నిప్పు అని అంటుంటారు, ఐటీకి పితామహుడిని నేనే అంటారు, కానీ ఆయనకు కనీస జ్ఞానం లేదా, మీ అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు, అందుకే ఆయన ఆధారాలు చూపరు

జగన్‌ గారు ప్రెస్‌ మీట్‌లో అడిగిన ప్రశ్నలకు ఒక్కరైనా సమాధానం చెప్పారా, సూపర్‌ సిక్స్‌ అమలుపై ఎవరి కాలర్‌ పట్టుకుని నిలదీయాలి, చంద్రబాబు ఈ 9 నెలల్లో రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారు, మరి ఆ డబ్బుతో ఒక్క బటన్‌ ఐనా నొక్కారా, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది సమాధానం చెప్పండి

కూటమి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వారిని తొలగించారు, ఇది విధ్వంస పాలన కాదా, జగన్‌ గారు బటన్‌ నొక్కి రూ. 2.73 లక్షల కోట్లు పంపిణీ చేసింది వాస్తవం కాదా, మరి మీరెందుకు నొక్కడం లేదు సమాధానం చెప్పండి

జగన్‌ గారు వాస్తవాలు, గణాంకాలు, నివేదికలు చూసి చెబితే మీరు అంగీకరించలేరా, లిక్కర్‌ స్కాంలో మిథున్‌ రెడ్డి పేరు రాశారు, ఆయనకు లిక్కర్‌ కి ఏం సంబంధం, ఇలాంటి కేసులు నిలబడతాయా, కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నాం, జగన్‌ గారి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పండి, కారుకూతలు మానుకోండి అని హితవు పలుకుతున్నాను.

Back to Top