కర్నూలు: సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అన్నారు. కర్నూలు మండలం నందనపల్లి గ్రామంలో మంగళవారం సుధాకర్ "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే స్థానిక గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్ తో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ వారికి వివిధ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూర్చింది, ఎంత లబ్ధి పొందింది ప్రజలకు వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సంబంధించిన అధికారితో సమన్వయం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపుతూ ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె.మాధురి , సచివాలయ కన్వీనర్లు వెంకటేశ్వర్లు, అనిల్ బాషా, ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ నెహమ్యా, మాజీ మండలం ఉపాధ్యక్షులు వాసు, మజీద్, నాగరాజు, సింగిల్ విండో చైర్మన్ శేషి రెడ్డి,గోపాల్నా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు