చంద్రబాబు రాయలసీమ ద్రోహి

ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
 

క‌ర్నూలు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ ద్రోహి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి విమ‌ర్శించారు. క‌ర్నూలు లో త‌ల‌పెట్టిన రాయ‌ల‌సీమ గర్జ‌న కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరమ‌న్నారు. వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ఆమె కోరారు. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నార‌ని ఎమ్మెల్యే తెలిపారు. కచ్చితంగా క‌ర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అవుతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Back to Top