ఓటీఎస్‌...ల‌బ్ధిదారుల‌కు వ‌రం

శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
 

క‌ర్నూలు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ల‌బ్ధిదారుల‌కు వ‌రం లాంటిద‌ని శ్రీ‌శైలం ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పేర్కొన్నారు.  మ‌హానంది మండలంలో నిర్వ‌హించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జ‌గ‌నన్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కం(ఓటీఎస్‌) ద్వారా కేవలం 10,000 రూపాయలతో సొంత ఇంటిపై ఉన్న రుణాలు మాఫీ చేసుకొని సంపూర్ణ హక్కు పొందవచ్చు అన్నారు. హోసింగ్ లోన్లు కట్టొద్దు అంటూ చంద్రబాబు పిలుపు ఇవ్వటం బాధ్యత రాహిత్యమ‌ని మండిప‌డ్డారు. మనం ఇళ్లల్లో ఉన్నాం కానీ హక్కులు లేకుండా చేసింది టీడీపీ ప్ర‌భుత్వ‌మే అని విమ‌ర్శించారు. ఓటీఎస్  ద్వారా ఇండ్లు రెగ్యులర్ చేసుకుంటే సంపూర్ణ హక్కు వస్తుంద‌ని చెప్పారు. ఆ ఇంటిపై రుణాలు పొంద‌వ‌చ్చు అన్నారు. ల‌బ్ధిదారుల‌కు పూర్తి హక్కు క‌ల్పించ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని తెలిపారు.  పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల ఖర్చుల కోసం కుదువ కూడా పెట్టుకోవచ్చు  అని వివరించారు.ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పిలుపు కు అపూర్వ స్పందన వ‌చ్చింది.  అప్పటికప్పుడే సెటిల్మెంట్ అమౌంట్ కట్టేందుకు చాలా మంది లబ్ధిదారులు ముందుకు వచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top