పేద‌ల కోసం ఖ‌ర్చుకు వెనుకాడ‌ని మంచి మ‌న‌స్సు జ‌గ‌న్‌ది

పేద ప్ర‌జ‌ల కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చ‌యినా భ‌రించే మ‌న‌స్సు మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిది. గ‌తంలో ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన రూ.2ల కిలో బియ్యాన్ని ప్ర‌వేశ‌పెడితే దాన్ని రూ.5.25 చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. మ‌ళ్లీ వైఎస్సార్ సీఎం అయ్యాక రూ.2లకే బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యాక నాణ్య‌మైన బియ్యాన్ని కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో బియ్యం పంపిణీని పైలెట్ ప్రాజెక్టుగా ప్ర‌వేశ‌పెట్టాం. వాహ‌నాలు వెళ్లలేని ప్రాంతాల‌కు కూడా వ‌లంటీర్ల ద్వారా బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. ఇంటికే డోర్ డెలివ‌రి చేయ‌డం ద్వారా కొండ ప్రాంతాల్లో ఉంటున్న‌వారి స‌మ‌యాన్ని ఖ‌ర్చును, ఆదా చేసి చూపిస్తున్నాం. జిల్లాలో మొత్తం 8,13,777 కార్డులున్నాయి. 15,226 మంది వ‌లంటీర్లు ద్వారా  2,015 డిపోల ద్వారా పార‌ద‌ర్శకంగా క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. నూక‌ల శాతాన్ని 25శాతం నుంచి 15 శాతానికి త‌గ్గించాం. డ్యామెజ్డ్ రైస్‌ను 6 శాతం నుంచి 1 శాతానికి త‌గ్గించాం. క్వాలిటీ రైస్‌కి అచ్చ‌మైన డెఫినిష‌న్ ఇచ్చిన ప్ర‌భుత్వం మాది. ప‌ది కేజీలంటే గింజ కూడా తేడా రాకుండా ఇస్తున్నాం. పైగా బియ్యం పంపిణీ చేస్తున్న సంచులు ఎండావాన‌కి పాడుకాకండా వాట‌ర్ ప్రూఫ్ సంచుల్లో ఇస్తున్నాం. 
- ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల్రాజు

Read Also: చంద్రబాబు అనుమానపు మొగుడులాంటి వాడు

తాజా ఫోటోలు

Back to Top