విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు -2 సచివాలయం పరిధిలోని ఎస్సీ కాలనీ,తూర్పు బజార్ నందు రాష్ట్ర ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో నూతన కాంతులను నింపుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఎటు చూసినా సమస్యలే ఎక్కువగా కనపడేయని నేడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో అలాంటి సమస్యలు లేకుండా ప్రగతి బాటలో నడుస్తున్నాయి అని అన్నారు,నవరత్నాల ద్వారా వైయస్ఆర్ చేయూత, ఆసరా, సున్న వడ్డీ, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి, ఎంపీపీ మార్కపుడి గాంధీ,జేడ్పిటిసి వూట్ల నాగమణి,మైనింగ్ పూసల కార్పొరేషన్ డైరెక్టర్లు బత్తుల రామారావు,చేని కుమారి,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వేల్పుల రవికుమార్,మండల పార్టీ అధ్యక్షుడు కనకపూడి భాస్కర్ రావు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు వూట్ల నాగేశ్వరరావు,మాజీ ఎంపీపీ గూడపాటి శ్రీను,మండల సచివాలయాల కన్వీనర్ కన్నమల శామ్యూల్,వైస్ ఎంపీపీలు గుంటుపల్లి వాసు,మండల సమైక్య అధ్యక్షురాలు కాకాని పద్మ,మాజీ అధ్యక్షురాలు బొమ్మి రాణి,సొసైటీ అధ్యక్షులు గింజుపల్లి నరసింహారావు,సోషల్ మీడియా కన్వీనర్లు తదితర ముఖ్య నాయకులు అధికారులు,సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు.