హరితాంధ్రప్రదేశ్ సాధ‌నే సీఎం వైయ‌స్ జ‌గ‌న్  లక్ష్యం 

 జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా 
 

చిత్తూరు: హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సిఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పనిచేస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా గొల్లపల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో  నాడు-నేడు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. పుత్తూరు గ్రామీణ మండలం గొల్లపల్లి లో రూ.37.05 లక్షల రూపాయలతో నాడు- నేడు మొడటి విడతలో ఆధునీకరించిన స్కూల్‌ను ఆమె ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. గొల్లపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో రక్షిత మంచినీటి ప్లాంటు ఎమ్మెల్యే ప్రారంభించారు. 
అక్క‌డే జగనన్న విద్యా కానుక ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను పంపిణీ చేశారు. అనంత‌రం జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణం కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌లు నాటారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top