జల్లికట్టు థ్రిల్లింగ్‌గా ఉంది

ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

చిత్తూరు: జల్లికట్టు కార్యక్రమం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పుల్లయ్యగారి పల్లిలో  సాంప్రదాయంగా జల్లికట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు. సంక్రాంతి అన్నది గ్రామాల్లోనే జరుపుకోవాలన్నారు. ఒక్కో పల్లెలో ఒక్కో విధంగా రైతులు ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పారు. జల్లికట్టులో కోడెలు రంకెలేస్తూ పరుగులు తీయడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. జల్లికట్టు చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆవులను చాలా అందంగా అలంకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కనుమ రోజు ఆవులను పూజించడం మన సాంప్రదాయమన్నారు.  ప్రభుత్వమే ఈ రోజు 2,600 దేవాలయాల్లో గోపూజలు నిర్వహిస్తూ..మన సంస్కృతిని రాబోయే తరాలకు చూపించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ గోపూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. 
 

Back to Top