చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా? పనికిమాలిన నాయకుడా?

రూల్స్‌కు విరుద్ధంగా సభ నుంచి ఏడాది సస్పెండ్‌ చేశారు

ఎమ్మెల్యే ఆర్కే రోజా

అసెంబ్లీ:  చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా? పనికిమాలిన నాయకుడా అని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు సభలో వ్యవహరిస్తున్న తీరు బాధకరమన్నారు. అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ..ఈ రోజు చంద్రబాబు మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లినట్లు ఉన్నాయి. 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా మేం సభలో అడుగుపెడితే మాట్లాడేందుకు అప్పట్లో మైక్‌ ఇవ్వలేదు. మేం నిరసన తెలియజేస్తుంటే చూపించలేదు. ఏవిధంగా మార్షల్‌ తీసుకొచ్చి బయటకు ఎలా విసిరేశారో అందరూ చూశారు. సుప్రీం కోర్టు కూడా వీరికి సరిగా బుద్ధి చెప్పింది. రాష్ట్రం విడిపోతే , రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించకుండా మహిళా ఎమ్మెల్యేపై కక్షసాధింపుగా ఏడాది సస్పెండ్‌ సరికాదని కోర్టు చెప్పింది. ఆ రోజు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో సీపీ రైడ్‌ చేస్తే 200పైగా సీడీలు దొరికాయి. వడ్డీకి రుణాలు తీసుకుంటే మహిళలకు బయపెట్టి, బ్లాక్‌ మనీ చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని అప్పట్లో వాయిదా తీర్మానం ఇచ్చాం. రెండో రోజు అంబేద్కర్‌పై ప్రేమ ఉన్నట్లు కాల్‌మనీ అంశాన్ని పక్కన పెట్టారు. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఈ అంశంపై చర్చించాలని మేం కోరితే పట్టించుకోలేదు. కామా సీఎం అన్నానని రూల్స్‌కు విరుద్ధంగా సస్పెండ్‌ చేశారు. హైకోర్టుకు వెళ్లి అనుమతితో అసెంబ్లీకి వస్తే..ఆ రోజు మార్షల్‌ అడ్డుకున్నారు. స్పీకర్‌ ఆ రోజు సమాధానం చెప్పలేదు. వైయస్‌ జగన్‌ సభలో మాట్లాడేందుకు వస్తే అడ్డుకున్నారు. నన్ను మార్షల్‌ లాక్కెళ్లారు.  ఈ రోజు చాలా గట్టిగా అరుస్తున్నారు. గట్టిగా అరిస్తే గడ్డిపొరక గర్జించే సింహాం కాలేదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఇదే అసెంబ్లీలో బోండా ఉమా మిమ్మల్ని అందర్ని పాతిపెడతా అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతుంటే మమ్మల్ని పాతిపెడతామంటే చంద్రబాబు ఆ రోజు బుద్ధి ఏమైంది? చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా? పనికిమాలిన నాయకుడా?. ఈ రోజు మద్యపానం, మహిళా బిల్లును వ్యకిరేకిస్తున్నాడు. రైతు భరోసా, అమ్మ ఒడిని వ్యతిరేకిస్తున్నాడు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే వైయస్‌ జగన్‌ను అభినందించకపోయినా ఫర్వాలేదు కానీ విమర్శించడానికి చంద్రబాబుకు అర్హత లేదు. నిన్న కూడా సభలో మగధీర డైలాగ్‌ మాదిరిగా  ఒక్కొక్కరు కాదు షేర్‌ ఖాన్‌ వంద మంది రండి అన్నట్లు..150 మంది రండి సమాధానం చెబుతా అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుతున్నాడా? వయసు మీరే కొద్ది ఛాదస్తం ఎక్కువైంది. కచ్చితంగా చంద్రబాబుకు ట్రిట్‌మెంట్‌ ఇవ్వాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top