ఈ నాలుగేళ్లలో రూ.1100 కోట్లతో మార్కాపురం అభివృద్ధి

సంక్షేమం, అభివృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది

వెలిగొండను మొదలుపెట్టింది డాక్టర్‌ వైయస్‌ఆర్‌.. పూర్తిచేసేది వైయస్‌ జగన్‌

‘వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం’ బహిరంగ సభలో ఎమ్మెల్యే  నాగార్జునరెడ్డి

ప్రకాశం జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మరో 10 సంవత్సరాల్లో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రరాష్ట్రం తయారవ్వబోతోందని మార్కాపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. ఈ నాలుగేళ్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పాలనలో రూ.1100 కోట్లతో మార్కాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అదే విధంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం రెండో విడత అమలు కార్యక్రమాన్ని మార్కాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పాల్గొని మాట్లాడారు.  

‘‘వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం అమలు చేసేందుకు మార్కాపురం నియోజకవర్గానికి విచ్చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. అగ్రవర్ణాల్లో పేదలు అనేకమంది ఉన్నారు. ఇప్పటికే చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆదుకుంటూ, కాపు నేస్తం ద్వారా కాపులను, ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలను సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకుంటున్నారు. అర్హత ఉన్న పేదలందరికీ సంక్షేమ పథకాల రూపంలో సాయం అందిస్తున్నందుకు సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు. చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా మహిళలకు పూర్తి భరోసా లభిస్తోంది. 

40 సంవత్సరాల కల అయిన పొదిలి పెద్ద చెరువు స్కీమ్‌కు రూ.50 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. గతంలో నాన్నగారు కేపీ కొండారెడ్డి అడిగిన వెంటనే దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ మార్కాపురానికి తాగునీరు అందించారు. వైయస్‌ఆర్‌ మొదటి దశ పూర్తిచేశారు. 14 ఏళ్ల నుంచి రెండో దశ పనులను ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు మళ్లీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో 26 జిల్లాలకు ఒక్కో మెడికల్‌ కాలేజీలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలకు రెండో మెడికల్‌ కాలేజీ అందించినందుకు కృతజ్ఞతలు. మార్కాపురం నియోజకవర్గంలో  నాలుగు సంవత్సరాల్లో దాదాపు రూ.1100 కోట్లతో అభివృద్ధి చేశాం. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుతో సహా 11 వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు సీఎం వైయస్‌ జగన్‌ హెలికాప్టర్‌ దిగిన స్కూల్‌ను నాడు–నేడు కింద రూ.3.60 కోట్లతో అభివృద్ధి చేశారు. 

వెలిగొండను మొదలుపెట్టింది డాక్టర్‌ వైయస్‌ఆర్‌.. పూర్తిచేసేది వైయస్‌ జగన్‌. ఇది ప్రజలంతా కచ్చితంగా నమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధిలో మీరు చూపించే ప్రేమ, సమానత్వం మరో 10 సంవత్సరాలు ముందుకు చూస్తే దేశంలో అగ్రగామిగా మన రాష్ట్రం తయారవ్వబోతోంది. 

మార్కాపురం అభివృద్ధి కోసం..
మార్కాపురం పట్టణంలో షాదీ ఖానా కావాలి.
మార్కాపురం పట్టణానికి అంబేడ్కర్‌ భవన్‌ కావాలి.
మార్కాపురం పట్టాణానికి బీసీ భవన్‌ కావాలి.
పొదిలిలో మెయిన్‌రోడ్డు, డ్రైనేజీ పూర్తిచేయాలి.
మెడికల్‌ కాలేజీకి 5 మంది రైతులు 13 ఎకరాలు ఇచ్చారు. వారికి కచ్చితంగా డెవలప్‌మెంట్‌ కింద రూ.3 లక్షల ఇస్తామన్నారు. అది నెరవేర్చాలి. 
2025లో సీఎం హోదాలో మళ్లీ మార్కాపురం వస్తారు. ఆరోజు మాతో ఒక పూర్తిరోజు ఉండాల్సిందిగా కోరుతున్నాం. 
 

Back to Top