అసెంబ్లీ: తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దళిత వ్యతిరేక పార్టీ, దళితులను హేళన చేసిన పార్టీ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఎస్సీ కమిషన్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌గా రెండుగా విభజించేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే టీడీపీ గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులకు అన్యాయాలు జరుగుతున్నాయని, దళిత సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని, ఎస్సీ కమిషన్‌ను రెండు విభజించి మేలు చేద్దామని సీఎం వైయస్ జగన్ నిర్ణయం మేరకు తీసుకొని బిల్లు ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులపై టీడీపీకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. ఎస్సీ కమిషన్ విభజన బిల్లు చరిత్రాత్మకం కానుందన్నారు. టీడీపీ చట్టాలు, పరిపాలన గురించి తెలియదు.. కేవలం దోచుకోవడం ఒక్కటే తెలుసు అన్నారు. సభలో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.