వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం నభూతో నభవిష్యత్‌

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
 

అమరావతి: అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ  తీసుకున్న నిర్ణయం నభూతో నభివిష్యత్‌ అని, ఇదోక కలుకితురాయి అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బిల్లు ఆమోదించడం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, వైయస్‌ జగన్‌ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన బిల్లును స్వాగతిస్తున్నట్లు మేరుగ నాగార్జున చెప్పారు. రాబోయే రోజుల్లో పేదల అభివృద్ధికి బాటలు వేసేలా ఈ బిల్లు ఉందని తెలిపారు. 
ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు,  ఏపీ చరిత్రలో ఓ మైలు రాయిని దాటే సమయంలో చారిత్రాత్మక బిల్లును అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. చంద్రబాబుకు దళితులన్నా..బలహీన వర్గాలన్నా నిర్లక్ష్యమని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ దళితులు, బలహీనవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారనిచెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రలో సువర్ణ అధ్యాయనం అన్నారు. ఇలాంటి కీలకమైన బిల్లును ఆమోదించే సమయంలో స్పీకర్‌పై దాడికి పాల్పడే చర్యలు చూస్తే ఎస్సీలు, బీసీలపై చంద్రబాబు వైఖరిని తెలియజేస్తుంది. దళిత, బహుజనులకు, మైనారిటీలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top