కార్యకర్త కాలర్‌ ఎగరేసేలా జగనన్న పాలన

మళ్లీ జగనన్నే ఎందుకు కావాలనేది జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

అందుకోసం 4 కార్యక్రమాలను రూపొందించాం

4 కార్యక్రమాలను వైయస్‌ఆర్‌ సీపీ ప్రతినిధుల సభలో వివరించిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాలర్‌ ఎగరేసేలా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన అందించారని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం మనందరం చేసుకున్న గొప్ప అదృష్టమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు జగనన్నే ఎందుకు కావాలనేది జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మన పార్టీ, ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రధానంగా నాలుగు కార్యక్రమాలను రూపొందించామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రతినిధుల సభకు హాజరైన వారంతా.. కిందస్థాయి వరకు ఆ కార్యక్రమాలను తీసుకెళ్లాలని వివరించారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ప్రతినిధుల సభలో నాలుగు కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే కన్నబాబు వివరించారు. 

ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

ప్రధానంగా నాలుగు కార్యక్రమాలను మన వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. 
1. జగనన్న ఆరోగ్య సురక్ష మొట్టమొదటి కార్యక్రమంగా క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నాం. ప్రతి సచివాలయంలో పౌరులందరికీ ఆరోగ్య సేవలు అందించే విధంగా 1.60 కోట్లు ఉన్న నివాసాలకు వెళ్లి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. 

2. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. జగనే మళ్లీ ఎందుకు రావాలంటే అనే కార్యక్రమం చేపడుతున్నాం. 
3. బస్సు యాత్రకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా అందిస్తాం.
4. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. 

జగనన్న ఆరోగ్య సురక్ష..
మొట్టమొదటి కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయంలోని వైద్య శిబిరాల్లో సీనియర్‌ వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. దీనిలో ప్రతి ఇంటికి మొదటి దశలో వాలంటీర్లు వెళ్లి సందర్శించి, క్యాంపుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. రెండవ దశలో శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు ఏడు ర్యాపిడ్‌ పరీక్షలతో ఆరోగ్య పరీక్షలను ఇంట్లో నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు. మూడో దశలో క్యాంపు తేదీని గుర్తుచేయడానికి, ఏఎన్‌ఎం ఆరోగ్య పరీక్షలను నిర్దారించడానికి వలంటీర్లు సచివాలయ పరిధిలోని ఇళ్లను సందర్శిస్తారు. నాలుగో దశలో సచివాలయంలో రోజంతా నిర్వహించే శిబిరాల్లో ప్రత్యేక వైద్యులు, సీనియర్‌ వైద్యులు ఉచిత సంప్రదింపులు, పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. దీనిలో 5వ దశ కీలకమైంది. ఐదవ దశలో చికిత్స పొందుతున్న వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తరఫున ఫాలోఅప్‌ చేయడం, చికిత్స, మెడిసిన్‌ అందించడం, ఇంకా పెద్ద ఆస్పత్రిలో చికిత్స అందించాలంటే దానికి సంబంధించిన సహకారం అందిస్తాం. 1.60 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో సీఎం చేపట్టిన కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా కొనసాగుతోంది. దీంట్లో అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల బాధ్యతతో మెలిగే ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వం సేవలు అందిస్తుంది కాబట్టి దాంట్లో మనమంతా సేవకుల్లా పాల్గొనాలనేది సీఎం వైయస్‌ జగన్‌ సందేశం. 

ఏపీకి మళ్లీ జగనే కావాలి.. మళ్లీ జగనన్నే రావాలి..
ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ జగనే కావాలి.. మళ్లీ జగనన్నే రావాలనే దానిపై ఒక కార్యక్రమాన్ని రూపొందించి.. త్వరలో దీన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో ప్రతి సచివాలయ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారులందరి వద్దకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్న పారదర్శక పాలన, వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులను వివరించాల్సిన అవసరం ఉంది. దీంట్లో సచివాలయ సందర్శనలు చాలా కీలకం. మొదటి దశలో ప్రతి సచివాలయంలో నిర్వహించాల్సిన నాలుగు కార్యక్రమాలు ఉంటాయి. వీటిలో మొట్టమొదటిది.. ఆ గ్రామంలోని ఆ సచివాలయ పరిధిలో ఏయే సంక్షేమ పథకాలు అందించామో డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డును అధికారులతో కలిసి ఆవిష్కరిస్తారు. సచివాలయ పరిధిలో శాశ్వతంగా ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. 

ఆ తరువాత ఆ గ్రామంలో పెద్దలతో కలుసుకొని ఏ విధంగా జగనన్న పరిపాలన అందిస్తున్నారో తెలుసుకొని, వారితో మాట్లాడి.. ఆ సాయంత్రం వారితో కలిసి డిన్నర్‌ చేయాలని ఈ కార్యక్రమంలో రూపొందించారు. ఆ తరువాత ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడుతారు. ఇంటింటి ప్రచారంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించాలని నిబంధన పెట్టారు. వీరు నిబంధనలను అనుసరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి 2019లో సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మేనిఫెస్టో హామీలు, అదే విధంగా 2014లో కపట నాయకత్వాన్ని అందించే చంద్రబాబు ఇచ్చిన హామీలు చూపించి ఎవరు ఎలా అమలు చేశారో సరిపోల్చి వివరించడం కీలక భాగం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రెసిడెంట్స్, చైర్‌పర్సన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఇతర నాయకులంతా పాల్గొనాలి. నవంబర్‌ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 

బస్సు యాత్ర.. 
ఈ బస్సు యాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో మమేకమై తమ ప్రభుత్వం ఇది అని గుర్తుచేయాలి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. వెనుకబడిన వారికి సాధికారత కల్పించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారు. మూడు జోన్లలో మూడు నెలల పాటు బస్సు యాత్ర సాగుతోంది. అక్టోబర్‌ 25న ప్రారంభమై.. 31వ తేదీన ముగుస్తోంది. 

ఆడుదాం ఆంధ్ర..
ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తారు. చురుకైన జీవన శైలిని ఏర్పర్చడం కోసం, యువతను గ్రామాల్లో ప్రోత్సహించి ఆరోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఐదు రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ క్రీడలు 45 రోజుల పాటు సచివాలయ పరిధిలో, మండల స్థాయిలో టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తారు. అన్ని క్రీడల కోసం ప్రత్యేకమైన కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనవరి 15 వరకు జరుగుతుంది. 

జగనన్న సైన్యంగా మనంతా ఇంకా ఈ 4 కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలకు చేరువగా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మళ్లీ ఎందుకు జగనే రావాలి.. మళ్లీ ఎందుకు జగనే కావాలనేది మనందరం ప్రతి ఇంటికి వివరించేందుకు సమాయత్తం కావాలని అభ్యర్థిస్తున్నా.. 
 

Back to Top