తాడేపల్లి: సంగం డెయిరీ పేరిట దొంగ సర్టిఫికెట్లు సృష్టించి టీడీపీ నేతలు దోపిడీ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విమర్శించారు. దోపిడీ చేసిన సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. శుక్రవారం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో కిలారి రోశయ్య మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో డెయిరీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కోపరేటివ్ డెయిరీల్లో టీడీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులపై చంద్రబాబు, లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ డెయిరీలను టీడీపీ నేతలు సొంత ఆస్తుల్లా భావించారని, సంగం డెయిరీలో మోసాలకు పాల్పడి అరెస్టైన వ్యక్తికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీలో దొంగ సర్టిపికెట్లతో 70 ఎకరాలకు పైగా భూమి దోచుకున్నారు. దోపిడీ చేసిన సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి. ప్రభుత్వ ఆస్తులన్నీ యథేచ్ఛగా దోపిడీ చేశారు. టీడీపీ హయాంలో రైతులను నిలువునా మోసం చేశారు. టీడీపీ నాయకులు పాల రైతులను మోసం చేసి సంపాదించారు. రైతులు పూర్తిగా లాభపడాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. రైతులు వారికి రావాల్సిన లాభాలు వారు స్వేచ్ఛగా పొందాలి’. అని ఎమ్మెల్యే రోశయ్య అన్నారు.