చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు

ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ
 

తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ విమర్శించారు. అన్ని కమిటీల సారాంశం అభివృద్ధి వికేంద్రీకరణే అన్నారు. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్నది సీఎం ఉద్దేశ్యమన్నారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కైలే అనిల్‌పై టీడీపీ గుండాలు దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసులపై బోండా ఉమా తీరును ఖండిస్తున్నామని చెప్పారు. అమరావతిలో 4 వేల ఎకరాలను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారన్నారు. రైతుల గురించి లోకేష్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 
 

Back to Top